సాధారణంగా ప్రభుత్వంలో ఏ శాఖలో అయినా మంత్రిగారిదే హవా కొనసాగుతుంది. మంత్రి చెప్పినట్టు.. మంత్రి ఆదేశించినట్టు పనులు జరుగుతుంటాయి. ఏ రాష్ట్రంలో అయినా.. ఇలా జరుగుతుందేమో కానీ.. ఏపీలోని ఒక కీలక శాఖలో మాత్రం ఉన్నతాధికారి హవానే సాగుతోందని అటున్నారు పరిశీలకులు. మంత్రి చెప్పడమే తక్కువని.. చెప్పినా.. వినే అధికారులు కూడా లేరని.. అన్నీ `ఆ సారే` కీలకంగా వ్యవహరిస్తున్నారని.. పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ శాఖపై ఏకంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపుకార్యాలయానికే ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. దేవదాయ శాఖపై కొన్నాళ్లుగా అనేక విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఈశాఖపై పట్టుకోల్పోయారని.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కొన్నాళ్లకిందట విశాఖలో ఉన్నతాధికారిపై.. ఒక మహిళా అధికారి ఏకంగా ఇసుక ముఖాన కొట్టిన వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపింది. తర్వాత.. అనేక ఆలయాలపై దాడులు జరిగాయి. ఇక, రామతీర్థంలో ఇటీవల రాముడి విగ్రహ ప్రతిష్ట సమయంలోనూ అధికారుల హవానే సాగింది. దీంతో కీలకమైన ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌గా ఉన్న టీడీపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు అవమానం జరిగిందనే వార్తలు వచ్చాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇష్యూ కూడా అయింది.
దీని తర్వాత.. విజయవాడ కనకదుర్గ గుడిలోనూ.. ఎంపీ కేశినేని నానికి అవమానం జరిగిందనే వార్తలు వచ్చాయి. వీటిని పరిశీలిస్తే.. మంత్రి వెలంపల్లి తన శాఖపై పట్టుకోల్పోయారని అంటున్నారు. అన్నీ ఒక సీనియర్ అధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని.. ఆయన పైవారి మెప్పుకోసం అన్నీ చేస్తున్నారని ఉద్యోగులు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారట. అంతేకాదు.. మంత్రికి కూడా తెలియకుండానే.. కొన్ని పనులు సాగుతున్నాయని పెద్ద ఎత్తున కలకలం రేగింది.
దీంతో ఇప్పుడు ఈ విషయం తాడేపల్లి వరకు చేరింది. సాధారణంగా.. కొన్ని శాఖల్లో మంత్రుల ప్రమేయం లేకుండానే.. అధికారులు చక్రం తిప్పుతున్న ఉదంతాలు ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. కానీ, దేవదాయ శాఖ విషయంలో మాత్రం మంత్రికి అన్నీ తెలిసే ఇలా జరుగుతున్నాయనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
అంటే.. సదరు ఉన్నతాధికారి.. మంత్రితో మిలాఖత్ అయ్యారని.. మంత్రి రాజకీయ కారణాలతో శాఖ పనులకు దూరంగా ఉంటూ.. అన్నీ సదరు అధికారి చేతిలో పెట్టారని.. దీంతో ఆ అధికారి.. తనకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారని.. సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు దేవదాయ శాఖపై ఏకంగా సలహాదారు దృష్టి పెట్టారని తెలిసింది. దీంతో మంత్రి ఇప్పుడు తర్జన భర్జన లో పడ్డారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.