మీరు కోపంగా ఉంటున్నారా? అయితే ,ఈ సమస్య మీకు ఉన్నట్లే .. తస్మాత్ జాగ్రత్త
కోపం అనేది ఒక స్థాయి అసంతృప్తి, మీ లోనూ మీ చుట్టూ ఉన్న వారిలోనూ ఉంటుంది. చాలాసార్లు మీ కోపానికి గురయిన వ్యక్తికంటే మీరే ఎక్కువ బాధపడతారు. మీకు కోపం వచ్చినప్పుడు మీ జీవితంలో ఎప్పుడూ చేయనంత మూర్ఖమైన పనులు చేస్తారు. ఆ విధంగా జీవించడం అంత తెలివైన పద్ధతేమీ కాదు.
దేనిపట్లనైనా కోపం రావడమన్నది మనకుండే గాఢమైన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. మీ ఉద్దేశంలో మీది అత్యంత ఉత్తమమైన జీవన పద్ధతి అని. ఒక విధమైన ఆలోచనా విధానం నుండి, అనుభవం నుండి ఏర్పడే దృఢమైన గుర్తింపే దీనికి కారణం.
ఎవరైనా ఈ పద్ధతికి భిన్నంగా ప్రవర్తిస్తే మీకు వాళ్లమీద కోపం వస్తుంది. దేని విషయంలో అయిన మీ ఇష్టాలు, మీ అయిష్టాలు, మీ గుర్తింపులు బలపడితే, మీరు సృష్టి నుండి దాన్ని వేరుచేస్తున్నారన్నమాటే. నాకిదంటే చాలా ఇష్టం’ అని మీరన్నారంటే అది కానిదాన్నంతా పెద్ద ఎత్తున తిరస్కరిస్తున్నారన్నమాట.
మీ ఇష్టాయిష్టాలు ఎంత దృఢపడితే మీరు అన్నిటి నుండి విడిగా ఉన్నట్లు వ్యవహరించడం కూడా అంత దృఢపడుతుంది. దేన్నో, ఎవరినో మీలో భాగంగా మీరు స్వీకరించనందువల్లే క్రోధం పొంగిపొరలుతుంది. ముక్తి అంటేనే అన్నిటితో మమేక మవ్వడం. వేరుచేయడం కాదు.
ప్రతీ సారి కోపం వస్తే మాత్రం అది పలు అనర్థాలకు దారి తీస్తుంది. అయితే కింద లక్షణాల కారణంగానే మీకు ఎక్కువగా కోపం వస్తుంది , అవేంటో చూద్దాం.. కోపం ఎవరికైనా సరే ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. కోపం అనేది ప్రతీ మనిషికి అవసరమే. ఎందుకంటే అది సహజమైన ఆరోగ్యకరమైన భావోద్వేగం. కానీ, సందర్భాన్ని బట్టి దాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
కోపాన్ని ప్రదర్శించడంలోనూ కొందరు ఆనందాన్ని ఆస్వాదిస్తారని పరిశోధకులు చెప్పే మాట. కానీ, అదే పనిగా కోప్పడుతూ ఉండటం మాత్రం చాలా ప్రమాదకరం. ఇలా చేస్తే మన అనుకునే వాళ్లు కూడా దూరం అవుతారు.
కోపం తెచ్చుకున్న క్షణంలో తలనొప్పి వస్తుంది, రక్త పోటు అధికంగా ఉంటుంది. శ్వాస వేగంగా ఆడుతుంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే వారితో పోల్చితే కోపిష్టుల్లో ఆందోళన, వ్యాకులత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలన్నది కూడా మనకు అవసరమే. అయితే మన శరీర నిర్మాణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే వేళకు నిద్రిపోవడం ఎంతో అవసరం.
కాగా ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల నుంచి 9గంటల సంతృప్తికరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అని వైద్యులు చెబుతున్నారు. మనం నాణ్యమైన నిద్ర పోగలితే హార్మోన్లు, గుండె, మెదడు తదితర అవయవాలలో రోగనిరోధక శక్తి పెరిగి మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటామని డాక్టర్ చెబుతున్నారు. కాగా ఏకారణంతోనైన సరియైన నిద్ర పోనప్పుడు విపరీతమైన కోపం, ఓపిక లేకపోవడం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం తదితర చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది.
కోపానికి, నిద్రకు సంబంధం ఉన్నట్లు ఆధారాలతో నిరూపించింది. నిద్ర సమస్యలను అధిగమించాలంటే పౌష్టికాహారం, వ్యాయాయం, మానసిక ప్రశాంతత మూడు కచ్చితంగా పాటించాలని డాక్టర్ ప్రజలకు సూచిస్తున్నారు. తర్వాత దాని గురించి సన్నిహితులతో చర్చించడం మంచిది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యుడు, స్కూలు టీచర్, ఇలా ఎవరితో నైనా సరే ఆ విషయాన్ని పంచుకోవాలి. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి. దాంతో తమను కోపోద్రిక్తులను చేస్తున్న పరిస్థితులను ఎలా అధిగమించాలో ఓ అవగాహన వస్తుంది. అలా సులువుగా కోపాన్ని అదుపులో పెట్టేసుకోవచ్చు. ముఖ్యంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.