పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా.. అయితే ?

Update: 2019-11-19 05:05 GMT
ప్రస్తుత రోజుల్లో టెంక్షన్ నుండి రిలీఫ్ కావడానికి చాలావరకు అందరూ టీ కి బాగా అలవాటు పడ్డారు. చాలామంది రోజుకి రెండు, మూడు సార్లు అయినా టీ తాగుతుంటారు. ఇక నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్న ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాత్రి సమయంలో  నిద్ర రాకుండా ఉండటానికి టీ తాగుతూ వారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.  టీ తాగడం మంచిదే. కానీ , ఇక్కడే ఒక కొత్త సమస్య వచ్చింది. సాధారణంగా మనం ఇంట్లో గానీ.. ఆఫీసులో గానీ  టీని  గాజు గ్లాసుల్లో తాగుతాం. కానీ ,  ఫ్రెండ్స్‌తో , ఫ్యామిలీతో  బయటికెళ్లినప్పుడు మాత్రం టీను పేపర్ కప్పుల్లో తాగాల్సి ఉంటుంది. ఇక ఇలా పేపర్ కప్పుల్లో టీ తాగడం.. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు చెప్తున్నారు.

అసలు టీని పేపర్ కప్పుల్లో ఎందుకు తాగకూడదో ఇప్పుడు చూద్దాం…సాధారణంగా  పేపర్ కప్పులను థర్మాకోల్‌తో తయారు చేస్తారు. కానీ, ఈ మధ్య చాలామంది థర్మాకోల్ బదులుగా పాలియస్టర్ అనే ఒక రకమైన ప్లాస్టిక్‌తో ఆ టీ కప్పులను తయారు చేస్తున్నారు.ఇక వేడి వేడి ఛాయ్‌ను ఈ కప్పుల్లో పోయగానే.. వాటిల్లో ఉండే ప్లాస్టిక్ కణాలు వేడికి కరిగిపోయి టీలో కలిసిపోతాయి. ఆ తరువాత అలాగే మనం దాన్నే తాగుతాం. దానితో దీర్ఘకాలిక రోగాలు రావడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధి బారిన కూడా పడే ప్రమాదం ఉందని ప్రముఖ వైద్య నిపుణులు చెప్తున్నారు.  

అలాగే  హార్మోన్ల అసమతుల్యత, దృష్టి లోపాలు, తరుచుగా అలసట చెందడం, చర్మ సంబంధిత రోగాలు లాంటి ఎన్నో సమస్యలు వస్తాయట. మరోవైపు కప్పులకు పూసే ఆర్టిఫీషియల్ వాక్స్ వల్ల జీర్ణప్రక్రియ వ్యవస్థ దెబ్బ తినడమే కాకుండా.. చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్స్ వాదిస్తున్నారు. అందుకే పేపర్ కప్పుల కంటే గాజు గ్లాసుల్లోనే టీ ఎక్కువగా తాగండి.
Tags:    

Similar News