ఆరు నెలల్లోనే ఎన్నికలు : జైట్లీ

Update: 2018-12-15 11:19 GMT
2019 సార్వత్రిక ఎన్నికలు ఆరు నెలల వ్యవధిలోనే జరుగుతాయని.. దేశంలోని ప్రజలందరూ జాగ్రత్తగా ఓటు వేసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి - బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన జైట్లీ.. కూటమి కట్టి వస్తున్న పార్టీలకు సుస్థిరత ఉండదని తేల్చిచెప్పారు. బీజేపీని ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్ని కాంగ్రెస్ తో ఏకమయ్యాయని.. ఈ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. మే 2014లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయని.. ఈసారి కూడా అదే సమయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ప్రాంతీయ పార్టీలు కూటమి కడితే వారి ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న పార్టీపై ఒత్తిడి తెస్తాయని.. దీనివల్ల దేశంలో పాలన సరిగ్గా సాగదని జైట్లీ స్పష్టం చేశారు.  దేశంలో సర్వ స్వత్రంతగా ఒక పార్టీకి పట్టం కడితే అభివృద్ధి సాగుతుందని చెప్పారు. బీజేపీకి వరుసగా రెండోసారి అధికారం ఇస్తే దేశం ముందుకెళ్తుందని చెప్పారు. ఇలానే చేస్తేనే వివిధ రాష్ట్రాలు కోరుతున్న ప్రత్యేక హోదా డిమాండ్ లు నెరవేరుతాయని చెప్పారు. దీన్ని బట్టి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతున్న ప్రత్యేక హోదా కల బీజేపీతోనే నెరవేరుతుందని జైట్లీ నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్టైంది..

వచ్చే ఎన్నికల్లో బాబు ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలోనే ఎన్నికలకు వెళుతున్నారు. అందుకే ఇస్తానన్న కాంగ్రెస్ తో కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నారు. ఇన్నాళ్లు ఇవ్వని బీజేపీ ఇప్పుడు ఇస్తానంటూ ఆఫర్ చేసినా బాబు అటు వెళ్లే అవకాశాలైతే కనిపించడం లేదు.
Tags:    

Similar News