గత పదేళ్ల నుంచి టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. హర్భజన్ ప్రభ తగ్గడం మొదలైన సమయంలో అశ్విన్ వెలుగులోకి వచ్చాడు. 400 పైగా వికెట్లు తీశాడు. హర్భజన్ పదిహేనేళ్ల క్రికెట్ కెరీర్ లో సాధించినదానిని అశ్విన్ పదేళ్లలోనే అందుకున్నాడు. అయితే, నాలుగేళ్ల నుంచి అతడి కెరీర్ ఒడిదొడుకలకు లోనవుతోంది.
ముఖ్యంగా 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వైఫల్యం అశ్విన్ కెరీర్ పై పెద్ద ప్రభావమే చూపింది. అతడితో పాటు జడేజా కూడా వన్డే, టి 20 జట్లకు దూరమయ్యాడు. కానీ, జడేజా మాత్రం రెండేళ్లలోపే పరిమిత ఓవర్ల జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అశ్విన్ ఇప్పుడిప్పడే మళ్లీ టి20ల్లోకి వస్తున్నాడు. ఇంకా పూర్తి స్థాయి విశ్వాసం మాత్రం పొందలేదు.
వీరిద్దరి స్థానంలో వారిద్దరూ 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం టీమిండియా అశ్విన్, జడేజా స్థానంలో కొత్త రక్తం ఎక్కించాలని టీమిండియా మేనేజ్ మెంట్ నిర్ణయించింది. ఈ క్రమంలో జట్టులోకి వచ్చనివారే కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్. కుల్దీప్ చైనామన్ స్సిన్నర్ కావడం.. అప్పటికి
ఒకరిద్దరు బౌలర్లు కూడా ప్రపంచ జట్లలో లేకపోవడంతో అందరినీ ఆకర్షించాడు. దీనికితగ్గట్లే కుల్దీప్ మొదట్లో తన వైవిధ్య బౌలింగ్ తో వికెట్లు పడగొట్టాడు. ఇటు చాహల్ కూడా మెరుగ్గా రాణించాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో కుల్దీప్ -చహల్ ద్వయం (కుల్చా) అద్భుతంగా రాణించి వన్డే సిరీస్ విజయానికి బాటలు వేశారు.
2018-2019 సీజన్‌లో కుల్దీప్ ను అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రి..విదేశాల్లో భారత్ తరఫున నంబర్ వన్ బౌలర్ అని ప్రశంసించాడు కూడా. దీనికి కారణం.. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన నాలుగో టెస్టులో కుల్‌దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం. ఇక చాహల్ టెస్టులు ఆడకపోయినా.. ఇంకా జట్టు ఎంపిక చాయిస్ లో ఉన్నాడు. అయితే, గత రెండేళ్ల నుంచి ఇద్దరూ ఫామ్ కోల్పోయారు. ముఖ్యంగా కుల్దీప్ గాడి తప్పాడు. అతడి బౌలింగ్ ఏమాత్రం పస లేకుండా సాగుతోంది. టీమిండియా కాదు కదా? ఆఖరుకు ఐపీఎల్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ లోనూ అతడికి తుది 11లో చోటు దక్కడం లేదు.
అశ్విన్ అంతగా ఫీలయ్యాడా?
పైన చెప్పుకొన్న విషయం పక్కనపెడితే.. కుల్దీప్ ను విదేశాల్లో టీమిండియా తరఫున నంబర్ వన్ గా రవిశాస్త్రి కొనియాడడం అశ్విన్ ను తీవ్రంగా ఆందోళనకు గురిచేసిందట. దీనిని అసలు తట్టుకోలేక పోయానని తాజాగా వాపోయాడు. వాస్తవానికి జడేజా మూడేళ్లుగా బ్యాట్ తో విశేషం గా రాణిస్తుండడం, బంతితోనూ అతడి అవసరం ఉండడం, తిరుగులేని ఫీల్డర్ కావడంతో టెస్టుల్లో టీమిండియాకు పెద్ద బలంగా మారింది. ఇదే సమయంలో బ్యాట్ తో విలువైన పరుగులు చేయగల సత్తా ఉన్నవాడు కావడంతో అవకాశం ఉన్నచోట ఇద్దరినీ ఆడించాల్సి వస్తోంది. పిచ్ పరిస్థితులను బట్టి ఒక్కోసారి అశ్విన్ ను పక్కనపెడుతున్నా.. అది పిచ్ కారణంగానే.
అతడిని తక్కువ చేయడం కాదు. కాగా, 2019 ఆస్ట్రేలియా పర్యటనలో కుల్దీప్ ను రవిశాస్త్రి నంబర్ 1 అనడం తట్టుకోలేకపోయా అప్పుడు బస్‌కింద తోసేసినట్లు అనిపించిందని అశ్విన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. నేను రవిశాస్త్రిని అమితంగా గౌరవిస్తా. మనలో ఎవరైనా కొన్నిసార్లుఏదో ఒకటి మాట్లాడి తర్వాత ఆ మాటలు వెనక్కి తీసుకుంటామని తెలుసు. కానీ, ఆ సమయంలో నేను చాలా బాధపడ్డా. అయితే,
వ్యక్తిగతంగా కుల్‌దీప్ ప్రదర్శన పట్ల నేనెంతో సంతోషించాను. ఆసీస్‌లో నాకు ఐదు వికెట్లు దక్కకపోయినా అతడికి దక్కాయని ఆనందించాను. అదెంత గొప్ప విషయమో నాకు తెలుసు. అది అభినందించాల్సిన విషయం కూడా. అంతకుముందు నేను ఆస్ట్రేలియాలో ఎన్నిసార్లు బౌలింగ్ చేసినా ఎప్పుడూ ఐదు వికెట్ల ప్రదర్శన చేయలేదు. అందుకే మనస్ఫూర్తిగా అతడి పట్ల సంతోషంగా ఉన్నా’ అని అశ్విన్ పేర్కొన్నాడు.‘ఇక సిరీస్ గెలిచాక నేను పార్టీలో పాల్గొనడానికి మనసు ఒప్పలేదు. ఎందుకంటే నేను ఆ పార్టీలో భాగస్వామి అవ్వాలంటే.. ఆ విజయంలో నాపాత్ర కూడా ఉండాలని అనుకుంటా.
అలా కాకుండా నన్ను బస్ కిందపడేసినట్లు అనిపిస్తే ఎలా ఉంటా? జట్టు విజయాన్ని ఎలా ఆస్వాదిస్తా? అక్కడి నుంచి నా గదికెళ్లి భార్య, కుమార్తెలతో మాట్లాడా. తర్వాత మళ్లీ మనసు మార్చుకొని జట్టు సంబరాల్లో పాల్గొన్నా. ఎందుకంటే అది ఒక చారిత్రక విజయం’ అని అశ్విన్ తన అనుభవాలను పంచుకున్నాడు. అలాగే ఈ సిరీస్ తర్వాత చాలాసార్లు ఆటకు వీడ్కోలు చెప్పాలనుకున్నట్లు కూడా అశ్విన్ చెప్పాడు.
తాను గాయాలపాలైనప్పుడు ఎవరూ పట్టించుకోలేదని, జట్టుకు ఎన్నో విజయాలు అందించిన తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందని బాధపడినట్లు తెలిపాడు. తాను సహజంగా ఎవరి సాయం కోరనని, కానీ.. అప్పుడు తనకు అండగా ఒకరు ఉంటే బాగుండేదని అనిపించిందని అశ్విన్ వివరించాడు.
పరిస్థితులు తారుమారు
కుల్దీప్, చాహల్ ఎంత వేగంగా వెలుగులోకి వచ్చారో అంతే వేగంగా వెనక్కెళ్లారు. కుల్దీప్ ప్రస్తుత ప్రదర్శన చూస్తుంటే మళ్లీ అతడు టెస్టు జట్టులోకి రావడం కష్టమేనన్న అంచనా ఉంది. చాహల్ కు టెస్టుల్లో ఆడగల స్థాయి ఉన్నా.. ఇప్పుడతడి అవసరం లేదు. కానీ, ఇదే సమయంలో అశ్విన్, జడేజా పుంజుకొని జట్టులో స్థానాలను శాశ్వతం చేసుకున్నారు. వీరికి గాయాలైతోనో, విశ్రాంతి ఇస్తోనో మిగతావారికి అవకాశం వస్తోంది.
అయితే, అదికూడా జయంత్ యాదవ్, కర్ణ్ శర్మ, షాబాజ్ నదీం వంటి స్పిన్నర్లకు తప్ప కుల్దీప్ , చాహల్ కు మాత్రం కాదు. రెండు, మూడేళ్ల క్రితం చూస్తే.. వీరిద్దర అశ్విన్, జడేజా స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చేలా కనిపించారు. కానీ కాలం అన్నిసార్లూ ఒకేలా ఉండదు కదా..? అంచనాలన్నీ తారుమారై.. పాత కాపులు అశ్విన్, జడేజాలే పెద్ద దిక్కులయ్యారు.