సీఆర్‌ డీఏ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి బొత్స!

Update: 2020-01-20 06:31 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఏపీ సీఆర్‌ డీఏ చట్టాన్ని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సీఆర్‌ డీఏ రద్దు బిల్లును మున్సిపల్‌ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. అలాగే అమరావతి అథారిటీ బిల్లును కూడా ఆయన సభ ముందు ఉంచారు .

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఏపీ సీఆర్‌ డీఏ చట్టం.. తన లక్ష్యం పూర్తి కాకుండానే భూస్థాపితం కాబోతుంది. హైదరాబాద్‌ లో జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా 2014 డిసెంబరు 20న అసెంబ్లీ ముందుకొచ్చిన ఈ బిల్లు.. ఇప్పుడు సరిగ్గా ఐదు సంత్సరాల ఒక నెల తర్వాత మళ్లీ జనవరి 20 వ తేదీనే రద్దు కాబోతుంది.  రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌ కు ఒక కొత్త రాజధాని కావాలని - దాని అభివృద్ధికి నిధులు కేటాయింపు - ప్రణాళికల రూపకల్పన - వాటి అమలుకు ఒక యంత్రాంగం ఉండాలనే ఉద్దేశంతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ  చట్టాన్ని అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. అలాగే  అంతకుముందు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.  ప్రస్తుతం దీనిపై అసెంబ్లీ లో చర్చ జరుగుతుంది.
Tags:    

Similar News