తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో మల్లారెడ్డి కాస్త భిన్నం. ఆయన మాటలు రోటీన్ కు భిన్నంగా ఉంటాయి. నిండైన ఆత్మవిశ్వాసంతో సాగే ఆయన ప్రసంగం.. పిల్లల్లో పిల్లోడి మాదిరి.. పెద్దల్లో పెద్దల మాదిరిగా మాట్లాడతారు. పెద్ద ఎత్తున ఉన్న విద్యా సంస్థల అధినేతగా ఆయన తిరుగులేని స్థానంలో ఉన్నారు. స్థానికంగా ఆయనకున్న పలుకుబడి అంతా ఇంతా కాదు. అలాంటి మంత్రి మల్లారెడ్డి మీద ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వారు ఏర్పాటు చేసిన సభలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటం.. ఇంతకాలం ఆయన ఆయుధంగా భావించే ఆయన మాటలే తాజాగా ఆయనకు శాపం కావటం గమనార్హం.
రెడ్డి సింహ గర్జనలో మంత్రి మల్లారెడ్డిపై ఎందుకు దాడి జరిగింది? ఆయన ప్రసంగంపై ఎందుకంత నిరసన వ్యక్తమైంది? ఆయన మాట్లాడుతుంటే.. వేదిక మీదకు వాటర్ బాటిళ్లు.. చెప్పులు.. కుర్చీలు విసిరేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందుస్తుగా జరిగిన కుట్రలో భాగంగా ఈ దాడి జరిగిందా? లేదంటే.. మంత్రి మల్లారెడ్డి మాటలే ఇలాంటి పరిస్థితికి కారణమైందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ప్రత్యక్ష సాక్ష్యలు కథనం ప్రకారం.. ఇది పూర్తిగా రెడ్డ సామాజిక వర్గానికి చెందిన సభ. తెలంగాణలో రెడ్లు.. వారి సంక్షేమం కోసం.. వారి డిమాండ్ల సాధన కోసం ఏర్పాటు చేసిన సభ. దీనికి మిగిలిన పార్టీల నేతలతో పాటు అధికారపార్టీకి చెందిన మంత్రి మల్లారెడ్డిని ఆహ్వానించారు. ఆయన ప్రసంగంలో రెడ్ల సంక్షేమం.. దాని కోసం తాను చేసే ప్రయత్నాల గురించి ప్రస్తావించి.. గతంలో ఇచ్చిన హామీలను చెప్పి.. అందులో పూర్తి అయినవి ప్రస్తావించి.. పూర్తి కావాల్సిన వాటిని ఎప్పటిలోపు పూర్తి చేస్తానన్న విషయాన్ని చెప్పి ఉంటే సరిపోయేది.
అందుకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను పొగడటంపైనే ఫోకస్ పెట్టటం సమస్యగా మారిందన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ సర్కారు హయాంలో తమ సామాజిక వర్గానికి ఏమాత్రం ప్రయోజనం కలగకపోగా.. తాము అన్నింట్లోనూ వెనుకబడి పోయామన్న ఆవేదన రెడ్డి సామాజిక వర్గంలో కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంతంగా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రెడ్ల ప్రాధాన్యత అంతకంతకూ కుదించుకుపోవటం.. రాజకీయంగా వారి ప్రభ తగ్గిపోవటంపై రెడ్లల్లో ఆగ్రహం ఉందంటున్నారు.
ఇలాంటి సభలకు వచ్చినప్పుడు తమ సామాజిక వర్గానికి సంబంధించిన అంశాల్ని ఎక్కువగా.. రాజకీయాల్ని వీలైనంత తక్కువగా.. ఆ మాటకు వస్తే అసలు ప్రస్తావించకుండా ఉంటే మంచిది. అందుకు భిన్నంగా రెడ్లకు తాము చేయబోయే అంశాల్ని ప్రస్తావించని మంత్రి మల్లారెడ్డి.. అందుకు భిన్నంగా టీఆర్ఎస్ సర్కారు పని తీరుపై కోతలు కోయటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను అదే పనిగా పొగడటం సభికులు ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. దీనికి తోడు తన మాటలపై వేదిక మీద ఉన్న ఇతర పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడైనా తన తీరును మార్చుకుంటే బాగుండేదంటున్నారు.
అలాంటిది చేయని.. ఆయన టీఆర్ఎస్ సభలా మార్చేసి.. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్న మాట.. అక్కడ ఉన్నోళ్ల కోపాన్ని పీక్స్ కు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. వాతావరణం.. పరిస్థితులకు తగినట్లుగా మాట్లాడాల్సిన మాటల్ని.. తనదైన ఫ్లోలో కొనసాగించిన మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైందన్న మాట వినిపిస్తోంది.