టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ సమయంలో పృథ్వీ షా వెంట అతడి స్నేహితుడు ఉండగా దుండగులు అతడిపై సైతం దాడికి యత్నించారు. ఈ ఘటన ముంబైలోని జోగేశ్వర్ వెస్ట్ లో బుధవారం రాత్రి చోటు చేసుంది. పృథ్వీ షా స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి పలువురి అరెస్టు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ అడిగితే ఇవ్వలేదనే సాకుతో ఇద్దరు వ్యక్తులు అతడు ప్రయాణిస్తున్న కారుపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. కారులో పృథ్వీ షాతో పాటు అతడి స్నేహితుడు ఆశిష్ యాదవ్ సైతం ఉన్నారు. ఈ ఘటనలో పృథ్వీ షాకు గానీ.. అతడి ఫ్రెండ్ కు గానీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన అనంతరం ప్వథ్వీషా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అతడి స్నేహితుడు అశిష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగి ఘటనతో సంబంధించి ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు కోర్టులో హాజరవనున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..
పృథ్వీ షా అతని స్నేహితుడు ఆశిష్ యాదవ్ తో కలిసి బుధవారం శాంతా క్రజ్ విమానాశ్రయం సమీపంలోని సహారా స్టార్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ సనా గిల్.. షోబిత్ ఠాకూర్ వారి అనుచరులు పృథ్వీ షా తో సెల్ఫీలు దిగాలని పట్టుబట్టారు. వారి కోరిక మేరకు పృథ్వీ షా వారితో సెల్ఫీలు దిగాడు. అయితే వారు వైరటీ యాంగిల్స్ లో సెల్ఫీ కావాలని తీవ్ర ఇబ్బందికి గురి చేశారు.
దీంతో అక్కడే ఉన్న హోటల్ మేనేజర్ జోక్యం చేసుకుని వారిని బలవంతంగా బయటకు పంపించారు. అయితే వారంతా బయట పార్కింగ్ ప్లేసులో వీరి కోసం కాపు కాశారు. షా మరియు అతని స్నేహితుడు కారు వద్దకు వెళ్లిన సమయంలో వీరు అక్కడి చేరుకొని వారితో గొడవకు దిగారు. బేస్ బాల్ బ్యాట్ తీసుకుని కారు అద్దాలు ధ్వంసం చేశారు.
అనంతరం రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తప్పుడు కేసు పెడతామని బెదిరించారు. ఈ ఘటన తర్వాత పృథ్వీ షా అక్కడి నుంచి మరో కారులో ఇంటికి వెళ్లిపోగా అతడి స్నేహితుడు నేరుగా పోలీసులను ఆశ్రయించగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.