మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క తనను చూసి మొరిగిందని ఒక వ్యక్తి ఐరన్ రాడ్ తో దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీ వాసులను షాక్ కు గురిచేసింది. కుక్క మొరగడంతో మొదలైన పంచాయితీ అమానుషంగా రాడ్ తో దాడి చేసే దాకా వెళ్లింది.
ఢిల్లీలోని పశ్చిమ విహార్ ప్రాంతంలో తమ పెంపుడు కుక్క మొరిగిందన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులపై ఓ వ్యక్తి ఇనుపరాడ్ తో దాడి చేశాడు. దాడిలో కుక్క కూడా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విషయమై కుక్క యజమాని రక్షిత్ పశ్చిమ్ విహార్ ఈస్ట్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ధరమ్ వీర్ దహియా అనే వ్యక్తి కుక్కను కలిగి ఉన్న పొరుగు కుటుంబానికి చెందిన ముగ్గురిపై ఇనుపరాడ్ తో దాడి చేశారు. తన యజమానిని ధరమ్ కొట్టడం చూసి ఆ కుక్క పరుగున వెళ్లి మొరిగింది. అతడిని కరిచింది. ఆ వ్యక్తి పెంపుడు కుక్కను సైతం కొట్టడంతో కుక్క కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న వారు ఆపడానికి ప్రయత్నించినా ఆ వ్యక్తి దాడిని ఆపకుండా వీరంగం సృష్టించాడు.
ధరమ్ తమ ఇంటి గుండా వెళుతుండగా.. ప్రధాన గేటు వద్ద కూర్చున్న తమ పెంపుడు కుక్క తనపై మొరిగిందని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు ఇనుపరాడ్ తో తీసుకొచ్చి గేటు వద్ద ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి ఇనుప రాడ్ తో కుక్కను కూడా కొట్టాడని ఫిర్యాదులో వెల్లడించారు.
పోలీసులు ఈ దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇదంతా సీసీటీవీ వీడియోలో రికార్డ్ కావడంతో వైరల్ గా మారింది. ఈ దాడిలో పక్కింటి 53 ఏళ్ల హేమంత్ కూడా నిందితుడు దహియా ఇనుపరాడ్ తో దాడి చేశాడు. ఈ ఘర్షణలో రక్షిత్ తోపాటు కుటుంబ సభ్యులలో ఒకరైన రేణు అలియాస్ యశోద అనే 45 ఏళ్ల మహిళ ను నిందితుడు కొట్టాడు.

Day light violence in Delhi paschim vihar A4 block.
— Mohit Mohlia (@MohitMohlia) July 3, 2022
This man attacked multiple people including a woman and a dog @narendramodi @DelhiPolice @CPDelhi @PMOIndia @ArvindKejriwal @AamAadmiParty @BJP4India @peta #AnimalAbuse #Attack #attempttomurder @ndtvvideos @ndtvindia pic.twitter.com/tsusXkZCDA