గంటా శ్రీనివాసరావు, ఏపీ రాజకీయాల్లో పెద్ద నాయకుడు. మాజీ మంత్రి. కంటిన్యూస్ గా ఏడేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన ఘనతను రీసెంట్ టైమ్స్ లో సాధించిన నేత. ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గంటా మంచి వ్యూహకర్త. ఆయన ఎపుడేమి మాట్లాడాలో ఎరిగిన నేత. ఎపుడు ఎక్కడ పావులు కదపాలో కూడా తెలిసిన నాయకుడు.
గంటా ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీ విజయం ఖాయమన్న సెంటిమెంట్ ఉండేది. అయితే తొలిసారి అది బ్రేక్ అయింది మాత్రం 2019 ఎన్నికల్లో. అప్పటికీ ఆయన గెలిచారు. పార్టీగా టీడీపీ ఎన్నికల్లో ఓడింది.
నిజానికి గంటా 2019 ఎన్నికల ఫలితాలను కూడా ముందే అంచనా వేశారు అంటారు. ఏపీలో వైసీపీ పవర్ లోకి వస్తుందని, జగన్ సీఎం అవుతారని గంటా పక్కాగా ఎస్టిమెంట్ చేశారు, అయితే ఆయన వైసీపీలో చేరాలనుకునేలోగా ఆయన మిత్రుడు అవంతి శ్రీనివాసరావు వెళ్లి బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నారు. మొత్తానికి టీడీపీలో ఉన్న గంటా అక్కడ గెలిచారు. కానీ ఆయన అనుకున్నట్లుగానే పార్టీ ఓడింది అన్న వారూ ఉన్నారు.
ఇక గంటా గత రెండున్నరేళ్లుగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆయన కంప్లీట్ గా సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. విశాఖ సిటీలో పార్టీ పడకేసినా ఆయన పట్టనట్లుగా ఉన్నారు. ఈ మధ్యన వైసీపీ నేతలు చంద్రబాబు ఫ్యామిలీ మీద కొన్ని కామెంట్స్ చేశారని ఆయన కంట నీరు పెట్టుకున్నారు. ఆ ఎపిసోడ్ లో దేశమంతా బాబుకు సానుభూతి తెలిపినా గంటా మాత్రం మౌనంగానే ఉన్నారు.
ఇంకో వైపు ఆయన అడుగులు ఎపుడూ పార్టీకి భిన్నంగానే సాగుతూ వచ్చాయి. గంటా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసి టీడీపీ పెద్దలకే షాక్ ఇచ్చారు.
ఆ తరువాత ఆయన తన రాజీనామాను ఆమోదించుకోవాలని కూడా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ని స్వయంగా కలసి వచ్చారు. అయితే ఆయన రాజీనామా ఆమోదం కాలేదు, ఆయన ఇప్పటికీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయితే అసెంబ్లీకి రావడం లేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మరి ఇవన్నీ చూసిన వారికి గంటా టీడీపీలో ఉన్నారా అన్న చర్చ అయితే రావచ్చు. దానికి వివరణ ఇవ్వాల్సింది పార్టీ నాయకులు. కానీ అదే పార్టీకి చెందిన పెద్ద నేతలకే గంటా మీద అతి పెద్ద డౌట్ వస్తే ఎలా.
ఇపుడు అదే హాట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య ఒక చానల్ ఇంటర్వ్యూలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గంటా టీడీపీలో ఉన్నారా అన్న డౌట్ వ్యక్తం చేయడం అంటే నిజంగా అది షాక్ గానే చూడాలి. గంటా పార్టీలో లేరా, అలా అని మీరు అంటే నాకూ అనుమానం వచ్చింది అంటూ ఆ ఇంటర్వ్యూలో సెటైరికల్ గా అయ్యన్న చెప్పిన సమాధానం గంటా వర్గానికి మంట పుట్టించేలా ఉంది.
గంటాకు ఒంట్లో బాగులేకపోవడం వల్లనే కొంతకాలంగా పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్నారని చెబుతూనే అయ్యన్న ఈ మాటలు అనడం అంటే సొంత పార్టీలో తన ప్రత్యర్ధికి ఎక్కడ కెలకాలో అక్కడ కెలికారు అన్న టాక్ అయితే వినిపిస్తోంది. అంటే గంటా పార్టీలో ఉన్నట్లుగా అయ్యన్నకు తెలియదు అనుకోవాలేమో.
మరి ఆయన సంగతే ఇలా ఉంటే హై కమాండ్ కూడా ఇలాగే భావిస్తోందా. ఏది ఏమైనా గంటా ఒక పొలిటికల్ ఫ్యాక్టర్. ఆయన్ని కాదని రాజకీయం చేసే సీన్ ఏపీలో ఏ పార్టీకి లేదు. ఇపుడు ఇలా అన్న వారే రేపటి రోజున ఆయన రాజకీయం చూస్తారని గంటా వర్గం అంటోంది. మొత్తానికి గంటా గురించి టీడీపీలో ఉన్న భావనను అయ్యన్న చెప్పారనే అంటున్నారుట.