బాగ్దాదీ ఈ కుక్క చేతిలోనే కుక్కచావు చచ్చాడు..

Update: 2019-10-29 06:38 GMT
సిరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా అమాయక ప్రజలని పొట్టనపెట్టుకుంటున్న ఐసిస్ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా బలగాలు చాలా చాకచక్యంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఇరాక్‌, టర్కీ, రష్యాల సహాయంతో బాగ్దాదీ జాడను కనిపెట్టిన అమెరికా ..అతన్ని అంతం చేయడానికి పక్కా ప్రణాళికని అమలు చేసింది. వేలాది మంది మహిళలపై అత్యాచారం చేసి వారిని కిరాతంగా హత్య చేసి ప్రపంచానికే సవాలుగా మారిన అబుబాకర్ అల్ బాగ్దాదీ చివరికి ఓ కుక్క వలన చనిపోతాను అని ఉహించి ఉండడు. కానీ , కుక్క చావు చచ్చాడు. అమెరికా తలపెట్టిన ఈ ఆపరేషన్ లో అమెరికా సైనికులతో పాటుగా ఆ దేశ కుక్కలు కూడా పాల్గొన్నాయి.

మొదట్లో బాగ్దాదీ ని చంపడానికి రోబోని వాడాలని ప్రయత్నించినా , ఆ తరువాత ఆ ప్రయత్నం అంత మంచిది కాదు అని వెనక్కి తగ్గారు. ఆ తరువాత పక్కా సమాచారంతో   అర్దరాత్రి సమయంలో బాగ్దాదీ ఉన్న ఇంటి ప్రాంగణాన్ని అమెరికా హెలికాప్టర్లు చుట్టుముట్టాయి. ఆ సమయంలో ఇంట్లోని వారు అమెరికా బలగాల మీద కాల్పులు జరిపారు. దీనితో బాగ్దాదీ ఇంట్లో ఉన్న సొరంగంలోకి వెళ్లిపోయాడు. అప్పటికే సొరంగం గురించి అవగాహన ఉన్న అమెరికా దళాలు ఓ కుక్కను సొరంగంలోకి వదిలాయి. కుక్క వెంబడించడంతో సొరంగం చివరికి వెళ్లిన బాగ్దాదీ టన్నల్ నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఆమెరికా దళాలకు భయపడి ఒంటి మీద అమర్చుకున్న బాంబులు పేల్చుకోవడంతో కుక్కచావు చచ్చాడు.తనతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా బాంబులతో పేల్చివేశాడు.

బాగ్దాదీని తరిమిన శునకం గాయపడటంతో దాని వివరాలను పెంటగాన్ గోప్యంగా ఉంచింది. కేవలం అది బెల్జియన్‌ మాలినోయిస్‌ జాతికి చెందినదని, మెరుపు వేగంతో పరిగెత్తి శత్రువులను వెంటాడగలదని మాత్రమే తెలిపింది. అయితే ట్రంప్‌ మాత్రం తమ వీర శునకం గురించి మాట్లాడుతూ... మా కెనైన్‌.. కొంతమంది దానిని కుక్క అంటారు.. మరికొంత మంది అందమైన కుక్క అంటారు... ఇంకొంత మంది ప్రతిభావంతమైన కుక్క అంటారు... తను గాయపడింది. ప్రస్తుతం దానిని వెనక్కి తీసుకువచ్చాం అని చెప్పారు. దాని పేరు చెప్పకుండా కేవలం ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.
Tags:    

Similar News