ఈ కొత్త క్షిపణి తో చైనాకు దబిడి దిబిడే.!

Update: 2021-12-18 13:30 GMT
దేశ రక్షణకు సంబంధించిన భారతదేశం చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయుధ పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించి భారతదేశ సామర్థ్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది. వీటన్నిటికీ ప్రధాన కారణం చైనా.. సరిహద్దు ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా ఆక్రమణ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే డ్రాగన్ ఎలాగైనా చెక్ పెట్టాలని భారత్ ఆయుధ పరీక్షలు నిర్వహిస్తుంది. తాజాగా ఒడిశాలోని బాలాసోర్ నుంచి కొత్తగా మరో క్షిపణి ని ప్రయోగించింది. దీంతో భారత అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరినట్లు అయింది.

బాలాసోర్ నుంచి ప్రయోగించిన క్షిపణి పేరు అగ్ని ప్రైమ్ అని భారత సైన్యం లోని ఉన్నతాధికారులు చెప్పారు. ఇప్పటికే భారత్ స్వదేశీ సాంకేతిక తో తయారు చేసుకున్నటువంటి అగ్ని సిరీస్లో ఇది కొత్త రకం క్షిపణి అని పేర్కొన్నారు. దీనితో సుమారు వెయ్యి నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని కూడా సులువుగా ఛేదించ వచ్చని అధికారులు చెప్పుకొచ్చారు. అధునాతన సాంకేతిక తో రూపుదిద్దుకున్న ఈ క్షిపణి ఖండాంతరాలలో ఉన్నాం లక్ష్యాన్ని కూడా ఇట్టే ధ్వంసం చేస్తుందని స్పష్టం చేశారు.

ఇప్పటికే భారత్ అమ్ములపొదిలో ఉండే అగ్ని-3 మిస్సైల్ కంటే ఇది చాలా లైట్ గా ఉంటుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో సుదూర లక్ష్యాలను ఇట్టే సాధించవచ్చని పేర్కొన్నారు. దీనిని సైన్యానికి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రయోగం విజయవంతం కావడంతో చైనా ఎప్పుడైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఆ దేశం లోని చాలా ప్రాంతంలో దాడి చేసేందుకు భారత్ దగ్గర ఆ సత్తా ఉందని చెప్పారు.

ఈ క్షిపణి కి ఓ ప్రత్యేకత ఉన్నట్లు సైనిక అధికారులు చెప్పారు. దీనినే వ్యూహాత్మక క్షిపణి గా పేర్కొన్నారు. కేవలం అణ్వాయుధాల సామర్థ్యం మాత్రమే కాక వ్యూహాత్మకంగా వ్యవహరించడం ఈ మిస్సైల్ ప్రత్యేకతని స్పష్టం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితంగా చేయించడం అగ్ని మిస్సైల్స్ ప్రత్యేకత అని సైన్యం పేర్కొంది. అలాంటి సిరీన్ నుంచి వచ్చిన ఈ అగ్ని ప్రైమ్ మిస్సైల్ రూపొందించడంలో అత్యంత అధునాతన సాంకేతిక ఉపయోగించినట్లు స్పష్టమైంది.

మన దేశం రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందుకే ఫ్రాన్స్ నుంచి కొత్తగా రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో భారత్ కు మరిన్ని ఆయుధాలను సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ భారత్ తన అస్త్ర సామర్ధ్యాన్ని పెంచుకుంటుంది.
Tags:    

Similar News