ఈ ఒక్కడు కేసీఆర్ కే షాక్ ఇవ్వబోతున్నాడా?

Update: 2019-04-12 11:28 GMT
కరీంనగర్.. కేసీఆర్ సెంటిమెంట్ జిల్లా.. ఏ పని మొదలుపెట్టాలన్నా కేసీఆర్ కు గుర్తుకు వచ్చేది కరీంనగర్ జిల్లానే.. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి ఏ కార్యక్రమమైనా.. పథకమైనా కేసీఆర్ కు కరీంనగర్ బాగా కలిసివచ్చింది. ఈ దఫా అసెంబ్లీ  - పార్లమెంట్ ప్రచారాన్ని కూడా కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభించారు. అలాంటి చోట కరీంనగర్ ఎంపీగా కూడా కేసీఆర్ గతంలో పనిచేశారు. అలాంటి ప్రతిష్టాత్మక సీటులో ఇప్పుడు ఒకే ఒక్క కుర్ర లీడర్ టీఆర్ఎస్ కు మచ్చెమటలు పట్టిస్తున్నాడట. కరీంనగర్ టీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను ఓడిస్తాడా అన్నట్టుగా పరిస్థితి తయారైందట.. కరీంనగర్ లో గెలిస్తే కాబోయే కేంద్రమంత్రి అంటూ కేసీఆర్ కీర్తించిన వినోద్ కు అంతలా గట్టి పోటీనిస్తున్నది ఎవరో కాదు.. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన యువనేత బండి సంజయ్..

బండి సంజయ్ మొన్నటి ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీచేసి కొద్దిలో ఓడిపోయారు. యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న ఈ నేత మాస్ లీడర్ గా కరీంనగర్ లో తిరుగులేని నేతగా అంచలంచెలుగా ఎదిగారు. అందరిని కలుపుకొని పోయి.. బీజేపీ తరుఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తల్లో నాలుకలా అందరికీ ఉంటాడని పేరుంది. వరుసగా రెండు సార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా ఓడడం.. పోయినసారి ఎమ్మెల్యే చాన్స్ తృటిలో చేజారడంతో జనాల్లో సింపథీ నెలకొంది.

ఇక తెలంగాణ అంతటా మొన్నటి ఎన్నికల్లో అతిరథ మహామహులు అయిన బీజేపీ రాష్ట్ర నేతలు ఓడిపోయారు. 103 చోట్ల తెలంగాణలో డిపాజిట్లు గల్లంతయ్యాయి. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా అందరూ ఓడిపోయినా.. బండిసంజయ్ మాత్రం కరీంనగర్ లో టీఆర్ ఎస్ ను ఓడించినంత పనిచేశాడు. ముస్లిం ఓట్లు పడి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడు.

ఈయన స్టామినా చూసే కేంద్రంలోని బీజేపీ పిలిచి మరీ కరీంనగర్ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు టీఆర్ ఎస్ ఎలాగూ గెలుస్తామని నిర్లప్లంగా వ్యవహరించారు. ప్రచారం చేయకపోవడం.. డబ్బు పంచకపోవడం.. కార్యకర్తలు - నాయకులను సమన్వయ పరచకపోవడంతో టీఆర్ ఎస్ క్షేత్రస్థాయి నేతలు కూడా బీజేపీకే ఈసారి ఓటు వేశామని.. మంచి నేత బండిసంజయ్ గెలవాలని కోరుకుంటున్నమని ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. మెజార్టీ ఓట్లు ఆయనకే పడ్డాయంటున్నారు. ఈ లెక్కన కేసీఆర్ సెంటిమెంట్ ఖిల్లా.. టీఆర్ ఎస్ కు కంచుకోట అయిన కరీంనగర్ లో గులాబీ వాడుపోతుందా అన్న టెన్షన్ టీఆర్ ఎస్ లో నెలకొందట.. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Tags:    

Similar News