బెంగళూరు డ్రగ్స్ కేసు అక్కడి కన్నడ సినీ పరిశ్రమనే కాదు.. టాలీవుడ్ నటీనటులను.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చుట్టుకుందని కొద్దిరోజులుగా మీడియాలో పుంకానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. దీనిపై బెంగళూరు పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.బెంగళూరు డ్రగ్స్ కేసులో మీడియా ఎదుట తాజాగా కలహర్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టినట్టు తెలిసింది. ఆయన ఈ డ్రగ్స్ కేసుపై మాట్లాడారు.
'మూడేళ్ల క్రితం పార్టీ జరిగింది వాస్తవమే.. శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో నాతోపాటు హైదరాబాద్ కు చెందిన చాలా మంది పాల్గొన్నారు. వ్యాపారవేత్తలు, ఈవెంట్ మేనేజర్లు సినీ ప్రముఖులతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు' అని కలహర్ రెడ్డి మీడియా ఎదుట చెప్పుకొచ్చారు.
అయితే ఆ పార్టీలో ఏం జరిగిందో నాకు తెలియదు అని.. పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీసులు నోటీసు ఇచ్చారని కలహర్ రెడ్డి తెలిపారు. బెంగళూరు పోలీసుల ఎదుట హాజరై నోటీసులకు సమాధానం ఇచ్చానని.. ఆ పార్టీలో నేను డ్రగ్స్ తీసుకోలేదని కలహర్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ కు నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన మీడియా ముందు తెలిపారు.