కరోనాతో కోలుకున్నా ఆ ముప్పు తప్పదట

Update: 2020-08-20 00:30 GMT
ప్రపంచమంతా ఇప్పుడు కరోనాతోనే పోరాడుతోంది. అయితే అందరికీ వచ్చి తగ్గిపోతే ఇక ఆ వైరస్ ఏం చేయలేదు కదా అన్న సందేహం అందరిలోనూ ఉంది. ఎందుకంటే కరోనాకు మందులు లేవు. వ్యాక్సిన్లు వచ్చే పరిస్థితి లేదు. దీంతో వైరస్ సోకి బయటపడితే ఇక తమ బతుకుకు భరోసా లేదని ఊహించుకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు..

కరోనాను జయించిన వారు వ్యాధి తగ్గిపోయిందని లైట్ తీసుకుంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా అనంతరం శ్వాసకోస సమస్యలు.. పిల్లల్లో ఇమ్యూనిటీ లోపాలు తలెత్తే అవకాశం ఉందని ఈ మహమ్మారిపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనాను జయించి కోలుకున్నారు. కానీ నాలుగు రోజులకే మళ్లీ శ్వాసకోస సమస్యలు, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. దీంతో తాజాగా నీతి అయోగ్ సభ్యుడు, కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ హెడ్ వీకేపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా నుంచి కోలుకున్నాక వస్తున్న అనారోగ్యాలు కరోనాకు సంబంధించిన కొత్త కోణాలని.. దీనిపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. ఇటువంటి కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయని వీకే పాల్ హెచ్చరిస్తున్నారు. వ్యాధి తర్వాత కూడా సమస్యలు తలెత్తుతున్నాయని.. కరోనాను జయించాక కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు
Tags:    

Similar News