కోడి ముందా.. గుడ్డు ముందా అనే సందేహం ఎంతోమందికి అంతుచిక్కని అంశం. ఎవరైనా సరదాగా ప్రశ్నించి... అవతలి వారిని ఓడించడానికి అడిగే సమాధానం లేని ప్రశ్న ఇది. అయితే ఈ ప్రశ్నపై ఇంతవరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. కొందరు దీనిని చాలా ఫన్నీగా తీసుకుంటే మరికొందరు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇక ఈ ప్రశ్న మీద ఎన్ని చర్చలు జరిగినా... చివరకు క్లారిటీ రాదు. అయితే ఈ ప్రశ్నకు సంబంధించిన క్లారిటీ ఓ అమెరికన్ జర్నలిస్ట్ ఇచ్చారు. అమెరికాకు చెందిన ఓ వెబ్ సైట్లో కోడి ముందా.. గుడ్డు ముందు అనే సందేహానికి వివరణ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎందుకు ఆలస్యం... ఏళ్లుగా తొలుస్తున్న ఈ చిక్కుముడిపై క్లారిటీ ఏంటో చూద్దాం రండి...
అమెరికాలోని సైంటిస్ట్ రాబర్ట్ క్రుల్విచ్ అనే జర్నలిస్ట్ కోడి ముందా.. గుడ్డు ముందా.. అనే అంశంపై చాలా పరిశోధనలు జరిపారు. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ కోసం ఓ థియరీ వివరించారు. దీనిపై చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. ఇదంతా ఓ అమెరికన్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. ఇంతకీ వారు ఏం అంటున్నారంటే... గతంలో భూమిపై కోళ్లు అసలే లేవని అన్నారు. అంతేకాకుండా కాలక్రమేణా ఈ పక్షి జాతి పుట్టుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. అనేక పరిణామాల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న కోళ్లు భూమిపై ఉద్భవించాయని వారు వివరించారు. ఒకప్పుడు భూమిపై కోళ్ల వంటి భారీ పక్షులు ఉండేవని చెప్పారు. ఆ పక్షులు గుడ్డు నుంచే ప్రస్తుతం మనం చూస్తున్న కోడి సంతతిని పోలిన పక్షి పుట్టిందని అందులో ప్రస్తావించారు.
కొన్ని వేల సంవత్సరాల క్రితం భారీ పక్షులు నేలమీదే ఉండేవని... వాటిని ప్రోటో కోళ్లుగా పిలిచారు ఈ సైంటిస్టులు. ఆ పక్షి గుడ్డు అనేక జన్యు ఉత్పరివర్తనలు చెందిన తర్వాత ప్రస్తుతం ఉన్న కోడిగా రూపాంతరం చెందిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మనం చూస్తున్న కోడికి.. నాటి కోడిని పోలిన భారీ పక్షి గుడ్డే కారణమని తేల్చి చెప్పారు. ఈ వివరణ ప్రకారం గుడ్డు ముందని వారు స్పష్టం చేశారు. వేల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న జీవులకు... ప్రస్తుతం ఉన్న జంతువులకు చాలా పరిణామక్రమాలు ఉన్నాయని వారు చెప్పారు. అందులో ఒకటి ఈ కోడి అంటూ పేర్కొన్నారు.
ఇప్పటి కోడిన పోలిన ఓ పక్షి గుడ్డులో అనేక జన్యు పరిణామాలు జరిగాయని ఆ జర్నలిస్ట్ తెలిపారు. అలా ఇప్పుడు మనం చూస్తున్న కోడి పుట్టుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. సో ఈ వివరణను చూసుకుంటే గుడ్డు ముందు అని తేల్చారు. జన్యు ఉత్పరివర్తనలకు ముందు అసలు కోడి లేదని వారు చెబుతున్నారు. పూర్వం ఉన్న పక్షిలో మార్పులు జరిగే కోడి ఉద్భవించిందని చెబుతున్నారు. ఈ రకమైన వివరణతో వారు గుడ్డే ముందని తేల్చేశారు. అందుకు సంబంధించిన థియరీని ప్రచురించారు. అయితే ఈ వివరణతో అందరూ ఏకీభవించడం లేదు. అమెరికన్ సైంటిస్టుల వివరణకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే కోడు ముందా.. గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఏదో ఒక సమాధానం కోసం వేచి ఉన్న వాళ్లు మాత్రం... ఈ వివరణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.