దీప్తి శర్మ 'మన్కడింగ్'పై రచ్చ: బెన్ స్టోక్స్, హర్ష భోగ్లే మధ్య ట్విట్టర్ వార్
ఇటీవల ఇంగ్లండ్ -టీమిండియా మహిళల జట్ల మ్యధ్య మ్యాచ్ లో టీమిడియా లేడీ క్రికెటర్ దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండా.. దీప్తి శర్మ బౌలింగ్ కు దిగింది. బాల్ పడకముందే క్రీజు దాటి పరిగెత్తిన షార్లెట్ ను 'మన్కడింగ్' ద్వారా దీప్తి శర్మ ఔట్ చేసింది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధ మంటూ చాలా రోజులుగా 'మన్కడింగ్'పై చర్చ సాగుతోంది. ఈ ఔట్ తాజాగా తీవ్ర వివాదాస్పదమైంది.
కొందరు దీప్తి శర్మను విమర్శిస్తే.. మరికొందరు అంతా నిబంధనలకు లోబడే జరిగిందని ఆమెకు మద్దతు తెలిపారు. అయినప్పటికీ ఇంగ్లండ్ క్రికెటర్లు దీన్ని 'క్రీడాస్ఫూర్తి'కి విరుద్ధమంటూ.. ఇలా గెలిచినందుకు భారత మహిళల జట్టుకు సిగ్గుపడాలంటూ ట్వీట్లు చేశారు.
ఇంతంటితో ఈ వివాదం ముగిసిందని అనుకుంటే తాజాగా మరోసారి అంటుకుంది. తాజాగా ఇదే 'దీప్తి శర్మ' చేసిన మన్కడింగ్ ఔట్ పై ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ప్రముఖ భారత క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే మధ్య ట్విట్టర్ వార్ నడిచింది.
మన్కడింగ్ ను రనౌట్ గా పరిగణించాలని ఐసీసీ ఈ మధ్యనే రూల్ మార్చింది. ఇవేమీ పట్టించుకోకుండా ఇంగ్లండ్ ఆటగాళ్లు, భారత జట్టు మోసం చేసి మ్యాచ్ గెలిచిందంటూ తెగ హల్ చల్ చేస్తున్నారు. గొడవ పెట్టుకున్నారు. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఏకంగా ఈ వివాదంలోకి సచిన్ టెండూల్కర్ ను లాగేసి నెటిజన్లతో తిట్లు తిన్నాడు.
ఈ వివాదంలోకి తాజాగా భారత్ స్టార్ కామెంటేటర్ హర్ష భోగ్లే చేరాడు. ఇంగ్లండ్ క్రికెటర్లు, మద్దతు దారులు,మీడియా చేస్తున్న అతిని కడిగిపారేశాడు. 'ఇంగ్లండ్ మీడియాలో చాలామంది క్రీడా రూల్స్ ను బట్టి నడుకున్న ఓ అమ్మాయిని టార్గెట్ చేయడం దారుణం. ఇలా అమ్మాయిని తిట్టి అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించుకోవాలని చూస్తున్నారు. ఇది వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇందులో కొందరు సోకాల్డ్ సెలబ్రెటీలు కూడా ఉన్నారంటూ' కామెంట్లు విసిరాడు.
ఈ ట్వీట్లకు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. 'హర్ష.. మన్కడ్ పై జనాల అభిప్రాయానికి కల్చర్ కు లింక్ ఏంటి? 2019 వరల్డ్ కప్ జరిగి రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ నన్ను భారత అభిమానులు రోజూ తిడుతూ మెసేజ్ లు చేస్తున్నారు. దీనిపై నువ్వేమంటావ్' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై హర్ష భోగ్లే మరోసారి కౌంటర్ ఇచ్చాడు.
'అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో నీ తప్పు లేదని.. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ విషయంపై అంటున్న మాటల గురించే మాట్లాడుతున్నారు.. క్రికెట్ గురించి నీకు ఏం చెప్పి నేర్పించారో అదే కల్చర్' అంటూ స్టోక్స్ దిమ్మదిరిగేలా గట్టి కౌంటర్ ను ఇచ్చాడు హర్షభోగ్లే. వీరి వివాదం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.