తమిళ రాజకీయం మరోమారు హీటెక్కుతోంది. ఇన్నాళ్లు అధికార అన్నాడీఎంకే కారణంగా ఆ రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా కనిపించగా...ఇప్పుడు తమిళ రాజకీయాల్లోకి రెండు కొత్త పార్టీలు ఎంట్రీ ఇవ్వనుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు మరో నటుడు కమల్ హసన్ కూడా పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడం ఈ కొత్త వేడికి కారణంగా మారింది. తాజాగా తమిళ దర్శకుడు భారతీ రాజా - సినీ ప్రముఖుడు సీమాన్ తలైవా - కమల్ రాజకీయ అరంగేట్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వయస్సు అయిపోయాక సినిమాలు ఉండవనే ఉద్దేశ్యంతో రాజకీయాలంటూ బయలు దేరారని రజనీకాంత్ - కమల్ హసన్ పై వారు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో సూపర్ స్టార్ రజనీ రాజకీయ అరంగేట్రంపై విరుచుకుపడ్డారు.
అన్నాడీఎంకే అధినేత్రి - ముఖ్యమంత్రి జయలలిత మరణించడం, డీఎంకేకె చీఫ్ కరుణానిధి అనారోగ్యం కారణంగా తమిళనాడు రాజకీయాల్లోకి కొత్త వ్యక్తులు వస్తున్నారని భారతీరాజ - సీమాన్ అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ ను అడ్డుపెట్టుకొని కొన్ని పార్టీలు ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని ఆరోపించిన భారతీ రాజా ఈ రకమైన ఎత్తులు తమిళనాడులో పని చేయవన్నారు. రజనీ స్థానికేతరుడని - విశ్వాసఘాతకుడని ఆరోపించారు. స్థానికేతరుడు అయిన రజనీకాంత్ ను అడ్డుపెట్టుకొని బీజేపీ లబ్దిపొందాలని చూస్తోందని వారు మండిపడ్డారు. తమను పాలించేందుకు ఆయనకు ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు.
రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ వెనుక ఉన్నదే బీజేపీ అని ఈ సినీ ప్రముఖులు ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు పొంది తమిళుల గురించి స్పష్టత వచ్చిన బీజేపీ రజనీకాంత్ ను తెరమీదికి తెచ్చిందని వ్యాఖ్యానించారు. తాము స్వంతంగా పోటీ చేస్తే ఓట్లు దక్కవనే రజనీని ముందుపెట్టిందని ఎద్దేవా చేశారు. అందులోనూ వయస్సులో ఉండగా హిమాయాల చుట్టూ తిరిగిన రజనీకాంత్ వయస్సు అయిపోయాక రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారని వారు ఎద్దేవా చేశారు. తమిళ ప్రజలకు తమను పరిపాలించే వారిని ఎన్నుకునే విషయంలో స్పష్టత ఉందని స్పష్టం చేశారు.