బీజేపీ నేత.. అఖిలేష్ యాదవ్ పీఎం కావాలంటున్నాడు!

Update: 2019-05-06 14:30 GMT
'అఖిలేష్ యాదవ్ పీఎం అవుతానంటే.. నేనూ ఆయనకు మద్దతునిస్తా - అఖిలేష్ లేదా ములాయం సింగ్ యాదవ్ పీఎం కావాలనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. వారికే నా మద్దతు ఉంటుంది..' అని అంటున్నాడు ఆజాంఘర్ లో అఖిలేష్ యాదవ్ మీద ఎంపీగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్. ఇతడు భోజ్ పురి నటుడు కూడా. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగారీయన.

అఖిలేష్ యాదవ్ మీద పోటీ చేశారు. అటు కులం కోణాన్ని ఉపయోగిస్తూనే అఖిలేష్ యాదవ్ మీద ఈయన ధ్వజమెత్తాడు. ములాయం సింగ్ యాదవ్ లేదా అఖిలేష్ లు ప్రధాని కావాలనుకుంటే తప్పు లేదని.. అయితే వారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అనుకుంటున్నారని.. అదే తనకు నచ్చడం లేదని ఈ నటుడు చెప్పుకొచ్చాడు. ములాయం, అఖిలేష్ లు ప్రధాని కావాలని అనుకుంటే  తను కూడా వారికే మద్దతు పలికేవాడినంటూ.. చెప్పుకొచ్చాడు.

కానీ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని అనుకోవడం ఏమిటని ధ్వజమెత్తాడు. అఖిలేష్ - ములాయంల తీరు సరిగా లేదని.. వారు మొత్తం 'యాదవులు' పై దేశ వ్యతిరేకులు అనే ముద్రను వేశారంటూ ఇతడు వ్యాఖ్యానించాడు. అలాంటి సమాజ్ వాదీ పార్టీని, ములాయం-అఖిలేష్ ను ఓడించి తీరాలని ఈయన అన్నాడు.
Tags:    

Similar News