రాజకీయాల్లో సెంటిమెంట్ మాటలు మామూలే. అయితే.. లాజిక్కు లేకుండా మాట్లాడే మాటలు తక్కువే ఉంటాయి. ఎందుకంటే.. సెంటిమెంట్‌కు లాజిక్ సరిగా లేకపోతే వర్క్ వుట్ కాదు. కానీ.. ఈ విషయాన్ని రాజకీయ అనుభవం అంతంతమాత్రంగా ఉన్న ఏపీ రాష్ట్ర మంత్రి అఖిలప్రియ అర్థం చేసుకున్నట్లుగా లేదు.
ఆమెకు రాజకీయ ఉపన్యాసాలు ఎవరు సిద్ధం చేస్తున్నారో కానీ.. తాజాగా ఆమె మాట్లాడిన మాటలు విస్మయానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఏపీ రాజకీయాల్లో మహా హీట్ జనరేట్ చేస్తున్న నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార.. విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్లో సాగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి వేళ.. అఖిల ప్రియ నోటి నుంచి వచ్చిన మాటలు షాకింగ్ గా మారాయి.
తన తల్లి మరణం గురించి ఆమె చెప్పిన మాటలు అతకటం తర్వాత.. మరీ.. ఇంతలా మాట్లాడతారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. తల్లి మరణాన్ని ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాడుకోవటం ఏమిటన్న విస్మయాన్నిరేకెత్తిస్తున్నాయి. రాజకీయాల్లో అందరి సానుభూతి పొందటానికి నేతలు మాటలు చెప్పటం మామూలే అయినా.. దాదాపు మూడేళ్ల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం గురించి మంత్రి అఖిలప్రియ ఇలా మాట్లాడటం ఏమిటన్న మాట వినిపిస్తోంది.
తన తల్లి శోభా నాగిరెడ్డి మరణాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ సోదరి షర్మిల కోసం వెళ్లి.. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారని వ్యాఖ్యానించారు. వైఎస్ ఫోటో పెట్టుకొని జగన్ వస్తున్నారని.. అదే రీతిలో తమ తల్లిదండ్రుల ఫోటో పెట్టుకోవటం తప్పా? అని ఆమె ప్రశ్నించారు.
షర్మిల కోసమే తన తల్లి చనిపోయిందన్న విషయాన్ని జగన్ ఎలా మర్చిపోతున్నారో అర్థం కావటం లేదంటూ అర్థం లేని రీతిలో మాట్లాడుతున్న మంత్రి షర్మిల మాటలు పలువురికి విస్మయాన్ని రేకెత్తిస్తున్నాయి. అఖిల ప్రియ మాటలు చూస్తుంటే.. ఏదైనా పనికి వెళ్లి వస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే.. ఆ పని కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా మాట్లాడటం కనిపిస్తుంది. ఏమైనా.. ఈ తరహా మాటలు రాజకీయాలకు ఎంత మాత్రం సరిపోవన్న అభిప్రాయాన్ని పలువురు వినిపిస్తున్నారు.