బిగ్ బ్రేకింగ్ : ఏపీ శాసన మండలి రద్దు...సీఎం కీలక నిర్ణయం !

Update: 2020-01-23 06:52 GMT
ఏపీ లో అధికారం చెప్పటినప్పటి నుండి పలు సంచలనమైన నిర్ణయాలతో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకొని , ఏపీ అభివృద్దే ద్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్న ఏపీ సీఎం జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో ఏపీ శాసన మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ముందుకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మంత్రులు..సీనియర్ నేతలకు సీఎం తన నిర్ణయం ఏంటో స్పష్టం చేసారు. దీని పైన మంత్రులు ముఖ్యమంత్రిని వారించే ప్రయత్నం చేసారు. రానున్న రోజుల్లో మండలిలో వైసీపీకే ఆధిక్యం వస్తుందని , ఇప్పుడు చేస్తే రాజకీయ కక్ష్యతో చేసినట్లు అవుతుందని, అందులోనూ కొన్ని న్యాయ పరమైన సమస్యలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ఇప్పుడు మండలి పై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అమలుకు సమయం పడుతుందని, దీని వలన ప్రయోజనం ఏంటనే కోణంలోనూ చర్చ జరిగింది.

అయితే, సీఎం మాత్రం మండలి విషయం లో కీలక నిర్ణయం దిశగానే ఆలోచన చేస్తున్నట్లుగా స్పష్టం అవుతుంది. దీని పైన ఈ రోజే అసెంబ్లీ లో తీర్మానం చేయడానికి రంగం సిద్దం చేస్తునట్టు విశ్వసనీయ సమాచారం. మండలిలో తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటం పైన ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారు. దీనికి తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలనే పట్టుదల తో సీఎం జగన్ కనిపిస్తున్నారు. అయితే , కొందరు మంత్రులు ఈ నిర్ణయానికి ఏకీభవిస్తున్నా..మరి కొందరు మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వానికి మండలిలో విలువ లేకుండా చేసారనే భావనతో ఉండటంతో, మండలి రద్దు కె ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తుంది.

ప్రభుత్వ బిల్లులకు విలువ ఇవ్వకుండా.. పార్టీ అభిప్రాయం మేరకు మండలి లో ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకం గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కొద్ది సేపటి క్రితం ముఖుల్ రోహిత్గీతో సమావేశమైన సీఎం శాసనమండలి రద్దు చేయటం పైన అభిప్రాయం తీసుకున్నట్లు గా సమాచారం. ఈ రోజు సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని..కేంద్రం నిబంధనల మేరకు వ్యవహరించినా తమకు అభ్యంతరం లేదని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు నిర్ణయం తీసుకున్నా కేంద్రం వెంటనే ఆమోద ముద్ర వేసే అవకాశం లేదు. దీని పైన పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మాత్రమే రద్దు నిర్ణయం అమల్లోకి రానుంది.

అయితే , ఎమ్మెల్సీ కోటాలో మండలిలో కొనసాగుతూ ..ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో మంత్రులుగా ఇద్దరు భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే మరో ఏడుగురు పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇక, రాజకీయంగా ఎలా ఉన్నా, నేరుగా పట్టభద్రులు..ఉపాధ్యాయుల ద్వారా సభకు ఎన్నికైన వారు ఈ నిర్ణయం పైన న్యాయ పోరాటానికి అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే , దీని పై టీడీపీ మాత్రం ఒకే మాట మీద ఉంది. మండలిని రద్దు చేసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. అది ఏడాది ప్రక్రియ అని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనితో ముఖ్యమంత్రి సభలో చేసే ప్రకటన పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News