ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీకి భారీ షాక్ ...అలాంటివాటికి నో పర్మిషన్ !

Update: 2019-12-24 05:17 GMT
ఇంజనీరింగ్ ఒకప్పుడు పేద , మధ్యతరగతి పిల్లలకి అందని ద్రాక్షలా ఉండేది. కానీ , మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీ రీయింబర్స్ మెంట్ పెట్టి ..అందరూ ఇంజనీరింగ్ , ఎం బి బి ఎస్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివేలా చేసారు. కానీ , ఇదే సమయంలో కొంతమంది ఈ చదువులపై కూడా వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఫీ రీయింబర్స్ మెంట్ అమలులోకి వచ్చిన తరువాత ..ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీలు ..LKG స్కూల్స్ లా సందుకొకటి అన్నట్టు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 287 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. దీనిపై ఏపీ సీఎం జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనలు పాటించకుండా, కనీస ప్రమాణాలు లేకుండా నడుస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకునేలా ఉన్నత విద్య నియంత్రణ.. పర్యవేక్షణ కమిషన్‌ సిఫారసులు చేయనుందని తెలుస్తోంది. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోని కాలేజీలకు చెక్‌ పెట్టాలని, అవసరమైతే ఫీజును తగ్గించడం లేదా అసలు ఫీజు లేకుండా సిఫారసు చేయాలన్న యోచనలో ఉన్నత విద్య నియం త్రణ కమిషన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 287 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా.. వీటిలో దాదాపు 50 కళాశాలలకు 2019-20 నుంచి 2021-22 విద్యా సంవత్సరాలకు ట్యూషన్‌ ఫీజును సిఫారసు చేయకుండా నో ఫీ జాబితాలో పెట్టే విధంగా సిఫార్సులు చేసే పరిస్థితి కనిపిస్తోంది.  

ఏపీలో ఉన్న కాలేజీల్లో.. వాస్తవిక ఆదాయ-వ్యయాలు, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త ట్యూషన్‌ ఫీజులను సిఫారసు చేయాలని కమిషన్‌ యోచిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉన్న కనీస ఫీజు రూ.35 వేలు తగ్గించే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలను పాటించని కాలేజీలపై తగిన చర్యలు తీసుకోవాలని చూస్తుంది. విద్యా ప్రమాణాలను పక్కనపెట్టి.. ప్రభుత్వం ఇచ్చే ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసమే నిర్వహిస్తున్న కాలేజీలపై ఉన్నత విద్య నియంత్రణ.. పర్యవేక్షణ కమిషన్‌ నిశిత దృష్టి సారించింది. ఇప్పటివరకు 3 దశల్లో 120 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రత్యేక బృందాల ద్వారా కమిషన్‌ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కొన్ని కాలేజీల పనితీరు అధ్వాన్నంగా ఉన్నట్లు కమిషన్‌ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా ఫ్యాకల్టీ విషయంలో దారుణమైన పరిస్థితి ఉన్నట్లు తేల్చింది. చూడాలి మరి వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల ఎన్ని కాలేజీలు మూతపడతాయో
Tags:    

Similar News