గిఫ్ట్‌ల కల్చర్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసక్తికర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. గిప్ట్ ల విలువ లక్షలు - కోట్లు దాటిపోయి వందల కోట్లకు చేరిపోతోంది. తాజాగా అవాక్కయ్యే అలాంటి గిఫ్ట్ ను ఓ తండ్రి తన కూతురుకు ఇచ్చాడు. అంతేకాదు... ఆ గిఫ్ట్ ధర ప్రపంచ రికార్డ్ కూడా కావడం ఆసక్తికరం. జెనీవాలలో ప్రపంచ ఆభరణాల వేలం జరుగుతున్న సమయంలో ఈ రికార్డు చోటుచేసుకుంది. ప్రముఖ వేలం సంస్థ సోత్ బే నిర్వహించిన ఈ వేలంలో అత్యంత అరుదై బ్లూ మూన్ వజ్రం రూ.320 కోట్ల (48.5 మిలియన్ డాలర్లు)కు పైగా ధర పలికింది. దీని బరువు 12.03 క్యారెట్లు. తన కూతురికి బహుమతిగా ఇవ్వడానికి హంకాంగ్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజం జోసెఫ్ లా కొనుగోలు చేసి రికార్డు ధరే కాదు...రికార్డు గిఫ్ట్ అనే ఘనత దక్కించుకున్నాడు.
ఐదేళ్ల క్రితం గ్రాఫ్ పింక్ నిర్వహించిన వేలంలో ఓ నీలి వజ్రం 306 మిలియన్ల ధరకు అమ్ముడుపోయింది. తాజాగా ఆ రికార్డును బ్లూ మూన్ వజ్రం తిరగరాసింది. బ్లూ మూన్ వజ్రం దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో గత ఏడాది లభించింది. హాంకాంగ్ కు చెందిన ప్రైవేట్ కలెక్టర్ కొనుగోలు చేశారని, దానికి ది బ్లూ మూన్ అని పేరు పెట్టారని సోత్ బే ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన బ్లూమూన్ డైమండ్ కథాకమామిషు.