ఈ రోజుల్లో ఎన్నికలంటేనే ఉచిత పథకాలు, లెక్కకు మిక్కిలి రాయితీలు.. ఓట్ల సందర్భంగా పంపిణీనే కాదు.. గెలిచాక ఎవరు ఎన్ని ఎక్కువ డబ్బులేస్తామంటే వారికే ఎక్కువ మొగ్గు. ప్రాంతీయ పార్టీలు, వాటి ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ ఇలాంటి అనుచిత పథకాలు బోలెడు పుట్టుకొస్తున్నాయి. ఏమాటకా మాట.. జాతీయ పార్టీల ప్రాబల్యం ఉంటే ఉచిత పథకాలు ఇచ్చేందుకు కొంత వెనుకాడతాయి.
ఆ రాష్ట్రంలో ఇచ్చారు..? ఈ రాష్ట్రంలో ఎందుకివ్వరు..? అనే ప్రశ్నలు వస్తాయనే భయంతో వెనకడుగు వేస్తుంటాయి. కానీ, ప్రాంతీయ పార్టీలు స్థానికుల ఆకాంక్షలకు ఎంత బాగా దగ్గరగా ఉంటాయో.. ఉచిత పథకాలకూ అంతే పెద్ద పీట వేస్తాయి. ‘‘మా చేతికి ఎముక
లేదంటుంటారు..’’అంటూ మళ్లీ దీనికో ట్యాగ్ లైన్.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం అక్కడి అధికార బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ‘లోక్ కల్యాణ్ సంకల్ప పత్ర’పేరిట కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేసిన ఈ మ్యానిఫెస్టోలో యూపీ వాసులపై హామీల వర్షం కురిపించారు. మరీ ముఖ్యంగా అన్నదాతలు,
నిరుద్యోగులు, మహిళా సంక్షేమంపై ఆ పార్టీ గురిపెట్టింది. రైతన్నల కోసం ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ వరాలిచ్చింది. ‘ఈ సంకల్ప పత్రాన్ని యూపీకి చెందిన భాజపా బృందం సిద్ధం చేసింది. ఇది కేవలం ప్రకటన పత్రం కాదు.
ఇది యూపీ ప్రభుత్వ తీర్మానం. 2017లో ఇచ్చిన 212 హామీల్లో 92 శాతం నేరవేర్చాం. మేం చెప్పింది చేస్తాం’ అని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.
కుటుంబానికో ఉద్యోగమట..
యూపీ బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రధానంగా ఆకర్షించినవి వ్యవసాయానికి ఉచిత విద్యుత్. కుటుంబానికో ఉద్యోగం. చిత్రంగా ఆ రెండు హామీలు తెలంగాణ, ఏపీలో 20 ఏళ్లుగా పార్టీల నోళ్లలో నానుతున్నవే. అది పక్కనపెడితే.. ప్రస్తుత యూపీ ఎన్నికలకూ బీజేపీ బీటినే నమ్ముకుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టరు.
దేశానికి అన్నం పెడుతూ సంక్షోభంలో కూరుకున్న సాగును బయట పడేయాలంటే ఇంతకుమించి చాలా చేయాల్సి ఉంటుంది కూడా. అయితే, ఇక్కడ రెండో హామీ కుటుంబానికో ఉద్యోగం. అసలు ఇలాంటి హామీ అమలు చేయగలమా? అనేది ఇతర రాష్ట్రాల అనుభవాలను చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఇలాంటి హామీనే ఇచ్చి
టీఆర్ఎస్ ప్రత్యర్థులకు దొరికిపోయింది. 25 కోట్ల వరకు జనాభా ఉన్న యూపీలో ఎంత లేదన్నా.. 7 కోట్ల కుటుంబాలైనా ఉంటాయి. మరి ఏడు కోట్ల ఉద్యోగాలు ఎలా ఇవ్వగలరని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం ఇవ్వగలిగే స్థితిలో బీజేపీ ఉందా? అంటే చెప్పడం కష్టమే. మరోవైపు యూపీలో ప్రధాన పంటలైన చెరుకు, గోధుమ రైతులకు కూడా బీజేపీ భారీ హామీలిచ్చింది.
బీజేపీ యూపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కొన్ని ప్రధాన హామీలు
* సాగునీటి కోసం రైతులకు ఉచిత విద్యుత్ వెసులుబాటు. గోధుమ, వరి పంటకు కనీస మద్దతు ధర.
* చక్కెర మిల్లుల పునరుద్ధరణకు రూ.5,000 కోట్లు. 15 ఏళ్లలో చెరకు బకాయిల మాఫీ.
* ఐదేళ్ల కాలంలో మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు. అందులో ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం.
* ఉజ్వల యోజన కింద హోలీ, దీపావళి పండుగల వేళ మహిళలకు( దారిద్ర్య రేఖ దిగువన ఉండే కుటుంబాలు) రెండు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు. 60 ఏళ్లు పైబడిన మహిళలు ప్రజా రవాణాలో ఉచితంగా ప్రయాణించే అవకాశం. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్‌లో పెంపు
* పట్టణ పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించేందుకు ‘మా అన్నపూర్ణ క్యాంటీన్’ ఏర్పాటు.
* కళాశాల విద్యార్థినులకు ఉచితంగా ద్విచక్రవాహనాల పంపిణీ. కన్యా సుమంగళ యోజన కింద ఇచ్చే మొత్తం రూ.25 వేలకు పెంచుతూ హామీ.