ఏపీకి బీజేపీ.. అప్లై అప్లై బట్ నో రిప్లై!

Update: 2019-10-23 06:54 GMT
రాష్ట్ర విభజనప్పుడు భారీగా కనిపించిన రెవెన్యూ లోటును తాము భర్తీ చేస్తామనేది అప్పుడు కేంద్రం ఇచ్చిన మాట. విభజన బిల్లులో విభజత ఏపీ ధ్రవ్యలోటును కేంద్రమే భరించాలని పేర్కొన్నారు. ఆ విభజన బిల్లుకు భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగానే మద్దతు పలికింది. తీరా తాము అధికారంలోకి వచ్చాకా మాత్రం విభజన బిల్లును వెక్కిరించింది కమలం పార్టీ.

తాము ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాను  తుంగలోకి తొక్కింది. నాటి బీజేపీ నేత, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అయితే  ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారో అందరికీ తెలిసిందే. అలా మాట్లాడి కూడా  కమలం పార్టీ  వాళ్లు ఏపీ ప్రజలను వెక్కరించినట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు.

ఆ సంగతలా ఉంటే.. తాజాగా  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా రకరకాల అంశాలను  ప్రస్తావించారు. ఏపీకి రావాల్సిన వాటి గురించి అడిగారు. రెవెన్యూ లోటు దగ్గర నుంచి పోలవరం నిధుల వరకూ జగన్ కేంద్రానికి విన్నపాలు చేశారు. అలాగే ప్రత్యేకహోదా గురించి కూడా ప్రస్తావించారు.

ఇలా ఏ ఒక్క అంశాన్నీ వదలకుండా జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి  విన్నపాలు చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, విభజన చట్టంలోని  అంశాలను నెరవేర్చాలని జగన్ కోరారు. అయితే ఇలాంటి విన్నపాలను కేంద్రంలోని కమలనాథులు వింటూనే ఉన్నారు. అయితే స్పందించింది మాత్రం లేదు.

స్పందించడం అంటే.. నిధుల విడుదల. ఆ పని మాత్రం చేయడం లేదు కమలనాథులు. దీంతో అప్లై అప్లై బట్ నో రిప్లై అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకవైపు ఏపీలో తాము బలోపేతం కావాలని కమలం పార్టీ వాళ్లు కలలు కంటూ ఉన్నారు. అయితే రాష్ట్రానికి చేయాల్సిన సాయం, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మాత్రం నిలబెట్టుకోవడం లేదు. ఇదీ సంగతి.
Tags:    

Similar News