యూకే కొత్త ప్రధాని ఆయనే!

Update: 2019-07-23 11:57 GMT
అగ్రరాజ్యాల్లో ఒకటైన యూనైటెడ్ కింగ్డమ్ కు కొత్త ప్రధాని ఎన్నికయ్యారు. థెరిస్సా మే స్థానంలో బోరిస్ జాన్సన్ యూకే నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. రాణి పేరుతో పాలన జరిగే యూకేలో ప్రధానమంత్రిదే కీలక అధికారం. అలాంటి పదవి బాధ్యతలు ఇప్పుడు కొత్త వ్యక్తి చేతికి అందబోతున్నాయి. బుధవారం జాన్సన్ అధికారికంగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారని సమాచారం.

యూకే పార్లమెంట్ ద్వారా ప్రధాని ఎన్నిక జరుగుతుంది. ఇది వరకూ జాన్సన్ పలు కీలకమైన పదవుల్లో పని చేశారు. వేర్వేరు నియోజకవర్గాల నుంచి వరసగా పలు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం లండన్ మేయర్ పదవిని అధిరోహించారు జాన్సన్. యూకే విదేశాంగ కార్యదర్శిగా పని చేశారు. కన్సర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు.

ఇప్పుడు  కీలకమైన యూకే ప్రధానమంత్రి పదవిని చేపడుతున్నారు. బ్రెగ్జిట్ డీల్ విషయంలో ఫెయిల్యూర్ తో థెరిస్సా మే ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నారు. దీంతో జాన్సన్ కు అవకాశం లభిస్తోంది.
Tags:    

Similar News