విమానంలో ప్రయాణికుడిని చితక్కొట్టిన బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్.. వైరల్ వీడియో

Update: 2022-04-22 11:30 GMT
అభిమానం హద్దులు దాటితే అభాసుపాలు అవుతుంది. ఓ అభిమాని అత్యుత్సాహం ఆ ప్రముఖుడికి ఆవేశాన్ని తెప్పించింది. అది దాడి చేసే వరకూ వెళ్లింది. కొన్ని సార్లు ఫ్యాన్స్ చేసే అత్యుత్సాహం సెలబ్రెటీలను చిర్రెత్తుకొచ్చేలా చేస్తుంది. సహనం కోల్పోయి తమ కోపాన్ని వారు ప్రదర్శిస్తారు.

తాజాగా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా తన సహనాన్ని కోల్పోయాడు. ఉక్రోషాన్ని ఆపుకోలేక ఓ అభిమానిని చితక్కొట్టాడు. అది కూడా ఓ విమానంలో కావడం గమనార్హం. దీన్ని కొందరు వీడియో తీయడంతో వైరల్ గా మారింది.

మైక్ టైసన్ ఓ అభిమానికి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వెళుతున్న విమానంలో కనిపించాడు. దాంతో అతడు మైక్ టైసన్ తో మాట్లాడాలని ప్రయత్నించాడు. అందుకు మైక్ అంగీకరించలేదు.

అయినా సరే ఆ అభిమాని వినిపించుకోలేదు. పదే పదే అతడి దగ్గరకు వెళ్లి విసిగించాడు. మైక్ టైసన్ ఎంత కూల్ గా ఉన్నా అతడిని సదురు వ్యక్తి రెచ్చగొట్టాడు. వెనుక సీట్ లో కూర్చొని మైక్ ను విసిగించాడు.

దాంతో సహనం కోల్పోయిన మైక్ టైసన్ వెంటనే అతడిపై పిడిగుద్దులు కురిపించాడు.  ఆ వ్యక్తి ముఖంపై టైసన్ అనేక పంచ్ లు వేయడంతో అతడి తలపై గాయాలయ్యాయి. ఆ విమానంలోనే ఉన్న మరో ప్రయాణికుడు దీన్ని వీడియో తీయడంతో ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం మైక్ టైసన్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.





Full View

Tags:    

Similar News