వరుసగా సంచలన నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి...మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు కొత్త ఈవోని నియమించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ స్థానంలో జేఎస్వీ ప్రసాద్‌ను నియమిస్తున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏపీ ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.
జేఎస్వీ ప్రసాద్ ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈయన స్థానంలో సతీష్ చంద్ర అనే మరో అధికారిని నియమించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ ని వేరేచోటకు బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంని ఆకస్మిక బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ఆయనను గుంటూరు జిల్లా బాపట్ల లోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు. దీంతో కొత్త సిఎస్‌గా ఎవరు వస్తారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్ని కొత్త సీఎస్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. సాహ్ని ప్రస్తుతం డిప్యుటేషన్ పై కేంద్ర సాంఘిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా ఉన్నారు.