ఉన్నత స్థానాలలో ఉన్న వారు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా లేక ఉదాశీనంగా వ్యవహరించిన చెల్లించే భారీ మూల్యం ఏమిటి అన్నది బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ రాజీనామా ఉదంతం ఒక ఉదాహరణ. ఇటీవల బోరిస్ తన పదవికి రాజీనామా చేశారు. దానికంటే ముందు ఆయన మంత్రివర్గ సహచరులు బోరీస్ మీద నమ్మకం లేదని వరసబెట్టి రాజీనామాలు చేశారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే దాని వెనక ఒక ఇంటరెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది.
బోరీస్ జాన్సన్ తప్పు అని తెలిసి కూడా తన మనిషిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. ఆయనే మాజీ ఎంపీ క్రిస్ పించర్. ఆయన మీద ఏడాది క్రితమే లైంగిక ఆరోపణలు వచ్చాయి. అయినా సరే ఆయన్ని ఈ ఏడాది ఫ్రిబవరిలో క్రిస్ పించర్‌ను బ్రిటన్ పార్లమెంటులో కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్‌గా నియమించారు. ఇది అందరికీ విస్తుబోయేలా చేసింది.
అయితే బోరీస్ జాన్సన్స్ అనుకూల వర్గాలు మాత్రం ప్రధానికి ఈ విషయం తెలియదని, అందుకే నియమించారని చెబుతూ వచ్చాయి. కానీ ఈ నియామకం జరిగిన తరువాత బోరీస్ కి క్రిస్ పించర్‌ను లైంగిక వేధింపుల కధ మొత్తం బాగా తెలుసు అని, అయినా సరే పట్టించుకోకుండా దూకుడుగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.
ఇక క్రిస్ పించర్ విషయానికి వస్తే ఆయన చేసిన పాపమేంటి, ఆయన మీద ఉన్న లైంగిక వేధింపుల కధా కమామీషూ ఏంటి అంటే చాలానే ఉంది అంటున్నారు. ఇక చూస్తెస్ క్రిస్ పించర్ లైంగిక వేధింపుల గురించి ఏడాది జూన్ 30న బ్రిటిష్ న్యూస్ పేపర్ ది సన్ లో ఒక వార్త ప్రచుతిరం అయింది. దాని మెరకు చూస్తే ఆనాటి కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్ క్రిస్ పించర్ లండన్‌లోని ఒక ప్రైవేటు క్లబ్‌లో ఇద్దరు మగవాళ్లను లైంగికంగా వేధించారని. అంతే కాదు, ఆయన కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారంటూ ఇతర బ్రిటిష్ వార్తా పత్రికలు కూడా వరుసగా కథనాలు రాశాయి.
ఇలా తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తరువాత కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్ పదవికి క్రిస్ పించర్ రాజీనామా చేశారు. అదే సందర్భంలో పార్టీ నుంచి కూడా ఆయనను సస్పెండ్ చేశారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపిన పించర్ ప్రొఫెషనల్ మెడికల్ సపోర్ట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ కళ్ల ముందు ఉన్న సంఘటనలు.
అదే విధంగా మీడియాలో ఇలా విషయం ఇంత గగ్గోలు పెడుతున్నా బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ పట్టించుకోకపోవడాన్ని ఇక్కడ సాటి మంత్రివర్గ సహచరులు తప్పుపట్టారు. అంతే కాదు ఆయన మంత్రివర్గంలో ఉండడం ఇష్టంలేక తప్పుకున్నారు. ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో బోరీస్ తన పదవికి రాజీనామా సమర్పించుకోవాల్సి వచ్చింది.
అయితే బోరీస్ మీద ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని చెబుతూ వస్తున్న బోరీస్ చివరికి వాస్తవాలు కళ్ల ముందు మరింతగా కనిపించేసరికి మాజీ ప్రధాని అయిపోయారు. ఇంతకీ ఈయన గారు క్రిస్ పించర్ కి అంతలా మద్దతుగా నిలవడానికి కారణాలు ఏమిటో తెలియరావడంలేదు కానీ మొత్తానికి పదవిని మాత్రం ఊడగొట్టుకున్నారు. దానికి కారణం బండగా చెప్పాలీ అంటే మగవాళ్ల సెక్స్ స్కాండల్. అంతే.