సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్న సంతోషం తప్పించి.. కమలనాథులకు వరుస ఓటములు తప్పటం లేదు. ఏదో హర్యానా రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించటం మినహా గడిచిన 22 నెలల్లో జరిగిన ఎన్నికల్లో చాలానే రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగలక తప్పలేదు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 4 నుంచి నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రక్రియ షురూ కానుంది. ఈ ఎన్నికల్లోనూ అసోం మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఏ మాత్రం కనిపించేటట్లుగా లేదన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రాష్ట్రాల్లో మొదటి నుంచి బీజేపీ లేదు కాబట్టి ఓకే. కానీ.. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించటం ద్వారా తమ సత్తా చాటాలని.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తోంది.
ఇందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే బీజేపీ నాయకత్వం షురూ చేసింది. అయితే.. వారెంత కష్టపడినా.. ఏడాది తర్వాత ఎన్నికల ఫలితం ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పేస్తోంది ఒక మీడియా సంస్థ. ఎన్నికల ఫలితాల్ని విశ్లేషించటం.. ముందస్తుగా అంచనా వేయటంలో పేరు ప్రఖ్యాతులున్న ఏబీపీ (ఆనంద్ బజార్ పత్రిక) మీడియా సంస్థ యూపీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండనున్నాయన్న జోస్యం చెబుతోంది.
మొత్తం 403 మంది ఎమ్మెల్యేలున్న ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కమలనాథులకు కరెంటు షాక్ లా మారటం ఖాయమన్న మాటను చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 185 స్థానాల్ని గెలుచుకోవటం ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు అధికారపక్షంగా వ్యవహరిస్తున్న సమాజ్ వాదీ పార్టీకి ఇంచుమించు అదే రీతిలో ఎమ్మెల్యేల్ని గెలుచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో అంచనా కంటే భారీగా సీట్లు తగ్గే అవకాశం బీజేపీ ఉంటుందని చెబుతున్నారు. ఈ పార్టీకి 80 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. మోడీ ప్రాభవం మరింత మసకబారే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.