జనవరి 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్లమెంట్ లో మన ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వచ్చేనెల 1వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ కూడా ఈ భేటీలోనే ప్రస్తావనకు రాబోతోన్నట్లు తెలుస్తోంది.
ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, గొడ్డేటి మాధవి సహా ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఈ భేటీలో కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఈ సందర్భంగా కీలక చర్చ జరిగినట్టు సమాచారం.
ఇక పార్లమెంటరీ సమావేశం ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం నిధులు, ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని తెలిపారు. అదే విధంగా, నివర్ తుపాను నష్టపరిహారం విడుదల చేయాలని కోరతామని అన్నారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం. రాష్ట్ర రెవెన్యూ లోటును పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం అని తెలిపారు. కాగా రాష్ట్రంలో దేవుడి విగ్రహాల ధ్వంసంలో చంద్రబాబు ప్రమేయం ఉందన్న వియసాయిరెడ్డి. ఆలయాలపై టీడీపీ దాడుల ఘటనపై ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే .. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది.
సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. మొదటి విడత ఎన్నికలకు సోమవారం నుంచే నామినేషన్లు ప్రారంభం కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించలేదు. దీంతో ప్రభుత్వ సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని.. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నాలుగో విడతకు రీషెడ్యూల్ చేశారు.