రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఇవాళ బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఛాతిలో అసౌకర్యంగా ఉందని రాష్ట్రపతి చెప్పడంతో గత శుక్రవారం ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత సమస్య ఉందని గుర్తించిన వైద్యులు.. ఎయిమ్స్ కు తరలించారు.
అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. ఆ తర్వాత ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్లో వెల్లడించారు.
'రాష్ట్రపతికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన వైద్యులను అభినందిస్తున్నాను. రాష్ట్రపతి ఆరోగ్యం గురించి వాకబు చేయడానికి ఎయిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడాను. ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను'. అని ట్వీట్ చేశారు.