లక్ష్మి పార్వతి కి 'క్యాబినెట్' హోదా... ఎలా అంటే !

Update: 2019-11-14 05:10 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ..పార్టీని నమ్ముకొని ఉన్న ఏ ఒక్కరి కి కూడా అన్యాయం జరగకుండా అందరికి న్యాయం చేస్తూ .. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట లో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటి కే పార్టీలో ఉన్న ప్రతి కీలక సభ్యుడి కి , సభ్యురాలికి కూడా తగిన పదవి ఇచ్చి గౌరవం ఇస్తున్నారు. అలాగే తోలి విడత లో మంత్రి వర్గంలో చోటు దక్కలేదు అని నిరాశలో ఉన్న వారికీ నామినేటెడ్ పోస్టులు ఇచ్చి , వారి అలక తీర్చాడు. ఇలా ప్రతి ఒక్కరికి వారికీ తగిన పదవులు కట్ట బెడుతూ .. పార్టీ లో అంతర్గత కలహాలు లేకుండా అందరిని కలుపుకుంటూ పోతున్నారు.

తాజాగా మరొకరికి జగన్ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తూ కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ గా నందమూరి లక్ష్మీపార్వతి కి కేబినెట్ హోదా కల్పిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రికి కల్పించే సౌకర్యా లతో పాటు జీతభత్యాలు, ఆమెకు సంబంధించిన ఇతర అలవెన్సులను ఉన్నత విద్యాశాఖ చెల్లించబోతోంది. ఇక ఈ పదవి లో లక్ష్మీ పార్వతి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా కొద్దిరోజుల క్రితమే ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి ని నియమించారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక తాజాగా ఆమెకు కేబినెట్ హోదా కూడా లభించింది. లక్ష్మీ పార్వతితో పాటు గల్ఫ్ దేశాల్లో ఏపీ ప్రత్యేక ప్రతినిధి గా నియమితులైన జుల్ఫీకి కూడా కేబినెట్ హోదా లభించింది. అయితే జగన్ పార్టీ పెట్టిన కొన్ని రోజులకు వైసీపీలో చేరిన లక్ష్మీ పార్వతి.. అప్పటి నుంచి ఆ పార్టీ లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. టీడీపీ నేతల పై ఎదురుదాడి చేస్తూ.. ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడే మాటలతో వార్తల్లో నిలిచారు. ఈ విధంగా కొన్నేళ్లుగా తన తోనే ఉంటూ.. తనకు మద్దతు ఇచ్చిన వారికి కీలక పదవులను కట్టుబెడుతూ వస్తున్నారు జగన్.
Tags:    

Similar News