కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దేశ రాజధానిగా ఉన్న ప్రాంతంతో పాటు ఉష్ణోగ్రత్తలు తక్కువ ఉండే ప్రాంతం కావడంతో కరోనా వైరస్ వెంటనే వ్యాపించే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఈ సందర్భంగా బహిరంగ కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రేక్షకులు హాజరయ్యే కార్యక్రమాలన్నీ చేపట్టేందుకు నిషేధం విధించింది. దీంతో ఢిల్లీలో ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించిన మ్యాచ్‌లను ఢిల్లీలో నిర్వహించకూడదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు మిగతా క్రీడా పోటీలపైన కూడా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని, ఇప్పటికే ఢిల్లీలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే స్టేడియంలో జనం పెద్ద సంఖ్యలో గూమిగూడే అవకాశం ఉండడంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఐపీఎలే కాదు మిగతా క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలను, పోటీలపై నిషేధం విధిస్తూ పేర్కొంది. ఇక ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా తిలకించే ఎఫ్ 1 రేస్ కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో క్రీడాభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే వాటిపై నిషేధించినట్లు తెలిపారు. అయితే ప్రజలందరూ పెద్ద సంఖ్యలో బయటకు రావొద్దని, గుమికూడి ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దని సూచించారు. శుభ్రత పాటించాలని, కరచాలనం చేయొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు కూబా బాధ్యతతో సహకరించాలని కోరారు.