ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ - విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని - కర్నూలులో హైకోర్టు ఉంటే తప్పేంటని జగన్ ప్రశ్నించారు. దీంతో రాజధానిపై జగన్ ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చని అంచనాలు మొదలయ్యాయి.
ప్రభుత్వం మనసులో మాటనే కమిటీ రిపోర్టుగా ఇస్తుందని చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ - పరిపాలన వికేంద్రీకరణతో సమస్యలు వస్తాయని కొందరు వాదిస్తున్నారు. అయితే, దేశంలో చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట - హైకోర్టు మరోచోట ఉన్న విషయాలను కొందరు మేధావులు ఎందుకు గుర్తించడం లేదో మరి.