రఘురామ కోర్టు పక్షిగా మారారెందుకు?

Update: 2021-10-08 09:30 GMT
మహానగరాల్లో.. పట్టణాల్లో పెద్దగా అవగాహన ఉండదు కానీ.. ఊళ్లల్లో కోర్టు పక్షులు అని కొందరు ఉంటారు. నిత్యం వారు కోర్టు వద్దే కాలం గడుపుతుంటారు. వారికి తెలిసినన్ని లిటిగెంట్లు చిన్న లాయర్లకుతెలీను కూడా తెలీవని చెబుతారు. అంతటి అపారమైన అనుభవం ఉన్న వారు.. ఎవరినైనా టార్గెట్ చేస్తే.. వారిని ముప్పు తిప్పలు పెట్టేంతవరకు వదిలిపెట్టరు. తాజాగా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసుల మీద కేసులు వేస్తున్న సంగతి తెలిసిందే. న్యాయస్థానంలో ఆయన వేసిన కేసులకు తీర్పులు సానుకూలంగా లేకున్నా.. ఆయన మాత్రం తగ్గకుండా అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్న వైనం ఆశ్చర్యకరంగా.. ఆసక్తికరంగా మారింది.

దీనికి కారణం ఏమిటి? ఎందుకిలా? జరుగుతున్న దాని వెనుక అసలు లెక్కలు ఏమిటి? అన్నదిప్పుడు కీలక చర్చగా మారింది. తాను టార్గెట్ చేసిన పార్టీ అధినేత కమ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయనకు అత్యంత సన్నిహితుడు.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై అదే పనిగా కేసుల మీద కేసులు వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో వీరిద్దరికి కోర్టు ఇచ్చిన బెయిళ్లను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ ఫిర్యాదుతో పిటిషన్లు దాఖలు చేసిన రఘురామకు షాకిచ్చేలా వాటిని కొట్టేసింది.

కోర్టులు కొట్టేస్తున్నా.. రఘురామ మాత్రం అందులోని సున్నితమైన పాయింట్లను టచ్ చేసి.. వాటిని కోర్టు ముందుకు తీసుకొచ్చి.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలన్న మొండితనంలో ఉన్నారు. సీఎం జగన్ కు.. విజయసాయికి ఇచ్చిన బెయిల్ ను క్యాన్సిల్ చేయించే వరకు నిద్ర పోనట్లుగా ఆయన తీరు ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే..తాజాగా ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను రిజిస్ట్రీ సాంకేతిక కారణాలతో రిజెక్టు చేసింది. దీంతో.. ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.

ఎందుకిలా చేస్తున్నారు? అన్నది పెద్ద ప్రశ్న. అయితే..ఆయన ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న లోతుల్లోకి వెళితే.. తాను ఎంపీగా వ్యవహరిస్తున్న వైసీపీ అధినేత మీద ఘాటు వ్యాఖ్యలు.. పెండింగ్ కేసుల్లో కాళ్లు చేతులు పెట్టటం చేయటం తెలిసిందే. ఆయన దాఖలు చేస్తున్న కేసులన్ని కూడా రాజకీయ కారణాలతోనే తప్పించి.. మరింకేమీ లేదన్నది స్పష్టమవుతోంది.

హైకోర్టులో వరుస పిటిషన్లు జారీ చేయటం ద్వారా.. ఆయన విచారణను సీబీఐ మరింత జాగ్రత్తగా చేపట్టాలని సీబీఐను కోర్టును ఆదేశించాలన్నదే రఘురామ వ్యూహంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ డీ విచారణ కేసును మరింత త్వరగా తేల్చాలన్న ఒత్తిడిని తీసుకురావాలన్నది కూడా ప్రయత్నంగా చెబుతున్నారు. ఈ కారణంతోనే తరచు కేసులు నమోదు చేస్తారని చెబుతున్నారు. ఎవరేం అనుకున్నా.. ఎన్ని ఒత్తిళ్లకు వచ్చినా తట్టుకుంటూ తాను టార్గెట్ చేసిన వారి మీదన స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరినట్లుగా తెలుస్తోంది.


Tags:    

Similar News