తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఎనస్షీషియనిస్ట్ డాక్టర్ సుధాకర్ వ్యవహారం తాజాగా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా నేడు ఈ కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కుట్ర కోణం ఉందని, కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ అధికారులు చేసిన విజ్ఙప్తి కి ఏపీ హైకోర్టు సానుకూలంగా స్పందించి గడువు ఇచ్చింది. ఈ కేసుపై తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. అయితే , నవంబర్ 11 నాటికి తుది నివేదికను సమర్పించాలని హైకోర్టు తెలియజేసింది.
ఈ కేసు గురించి పూర్తిగా చూస్తే .. డాక్టర్ సుధాకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించేవారు. కరోనా సమయంలో ఆస్పత్రిలో మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసింది. ఆ డాక్టర్ విషయం లో ప్రభుత్వ నిర్ణయం సమంజసం కాదు అంటూ విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. సుధాకర్ పై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులు ఆయన కనిపించ లేదు. మళ్లీ మే 16న విశాఖలో ప్రత్యక్షమయ్యారు. రోడ్డుపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సుధాకర్ మానసిక పరిస్థితి సరిగా లేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రిలో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ కి ఏర్పాట్లు చేసారు.
అక్కడ ఆయనపై సరైన రీతిలో చికిత్స అందించట్లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా.. ఏపీ హైకోర్టు డాక్టర్‌ను తప్పించింది. మరో కొత్త డాక్టర్‌కు డాక్టర్ సుధాకర్‌కు చికిత్స అందించే బాధ్యతలను అప్పగించింది. ఆ తరువాత.. డాక్టర్ సుధాకర్‌పై విష ప్రయోగం జరుగుతోందంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం, అదే సమయంలో ఈ కేసుపై విచారణ చేపట్టాలంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీనితో ఏపీ హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసుని సిబిఐ విచారణ చేస్తుంది.