బ్రేకింగ్: అన్ లాక్ 3.0 మార్గదర్శకాలివీ

Update: 2020-07-29 16:00 GMT
జూలై 31తో దేశంలో అన్ లాక్ 2.0 ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. స్కూళ్లు కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై ఆగస్టు 31దాకా యాథవిధిగా ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.

ఇక కంటైన్ మెంట్ జోన్లలో కఠినతర లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. అటు రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షలు ఎత్తివేసింది.

ఇక ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ లను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతించింది. కేంద్రం అనుమతించిన విదేశీ విమాన సర్వీసులు మాత్రమే నడిపిస్తారని తెలిపింది.

అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హాళ్లు, థియేటర్లు తెరవడానికి కేంద్రం నో చెప్పింది. వీటితోపాటు బార్లు, స్విమ్మింగ్ ఫూళ్లు, పార్కులు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. దీంతో సినిమా ఇండస్ట్రీ ప్రారంభమవుతుందని వేచిచూసిన వారికి నిరాశ ఎదురైంది.

*క్రీడా వినోద, విద్య, సాంస్కృతిక, మత , ఆధ్యాత్మిక, రాజకీయ వేడుకలు , సమావేశాలపై నిషేధం కొనసాగింపు..

*శ్రామిక్ రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు, విదేశాల్లోని భారతీయుల తరలింపు కోవిడ్ జాగ్రత్తలతో కొనసాగుతాయని కేంద్రం తెలిపింది.

*భౌతిక దూరంతో ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకలు.

*ఇక కేంద్రం ఆంక్షలను సడలించే అధికారం రాష్ట్రాలకు కేంద్రం తీసేసింది. అదనపు ఆంక్షలు మాత్రం రాష్ట్రాలు విదించుకోవచ్చు.

*కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారికి నష్టపరిహారం, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
Tags:    

Similar News