ప్రస్తుతం ఆంధప్రదేశ్ ఆర్థికంగా చాలా ఇబ్బందులని ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన చాలా హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు. ఆర్ధిక చేయూత ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు కేంద్రం అంతగా చేయూతనిచ్చిన దాఖలాలు లేవు. కానీ , రాష్ట్రప్రభుత్వం మాత్రం ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలని తీసుకు రావడంతో రాష్ట్ర బడ్జెట్ మరింత గా దిగజారి పోతోంది.
లోటు బడ్జెట్ రాష్ట్రంగా ప్రయాణం ప్రారంభించిన ఏపీ ఇంకా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఏపీకి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లు కూడా రాక ఏపీ సర్కార్ కుదేలవుతుంది . ఇక నేటి బడ్జెట్ కేటాయింపులపై ఆశగా ఎదురు చూస్తుంది. గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వలేదన్నది వాస్తవం . విభజన చట్టం ప్రకారం తమకు ఇవ్వాల్సిన నిధులు ఇప్పటికీ ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఎంత మొర పెట్టుకున్నప్పటికీ కూడా కేంద్రం నుండి సరైన స్పందన మాత్రం రావడంలేదు. వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉండగా మొదటి మూడేళ్లు కొంత సొమ్ము ఇచ్చినా , నాలుగో ఏడాది ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది. ఇక రాజధాని పై కేంద్రం మౌనం కూడా రాష్ట్రాన్ని మరింత అప్పుల్లొకి కురుకుపోయేలా చేస్తుంది.
ఇక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టి లో పెట్టుకుని ఏపీకి నీతిఆయోగ్ సిఫార్స్ చేసిన 666 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా కట్టబెట్టినప్పటికీ పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన 3, 283 కోట్ల రూపాయలను కేంద్రం రీయింబర్స్‌మెంట్ చేయాలని అడుగుతుంది ఏపీ సర్కార్.
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55, 548 కోట్లను ఆమోదించాలని సైతం ఎదురు చూస్తుంది. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని ఈ బడ్జెట్ లో అలాంటి కేటాయింపు ఏమైనా ఉంటుందా అని ఆశగా చూస్తుంది . రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని అప్పుడే ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్న నేపధ్యంలో కేంద్రం నేటి బడ్జెట్ ఏపీకి ఏమేర కలిసి వస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు ...