హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. దాదాపు 12 వేల కోట్ల వ్యయంతో 338 కిలో మీటర్ల మేర ఈ ప్రాజెక్టు నిర్మితం కానుంది. అందులో 9 వేల కోట్లు ప్రాజెక్టు కోసం మిగతా 3 వేల కోట్లు భూ సేకరణ కు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం తో పాటు, భూసేకరణ కోసం కలిపి దాదాపు 10 వేల కోట్ల ను కేంద్రం భరించనుంది. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది.
రీజినల్ రింగ్ రోడ్డు అనేది రెండు నేషనల్ హైవేల కలయిక. దీన్ని మామూలు జాతీయ రహదారిలా కాకుండా 8 లైన్ల ఎక్స్ ప్రెస్ వేలా తయారు చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకు అనుగుణంగా డీపీఆర్ సిద్ధమైంది. హైదరాబాద్ కు 20-30 కిలో మీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు ఉంటే... రీజనల్ రింగ్ రోడ్డు మాత్రం 50-60 కిలోమీటర్ల దూరంలో నిర్మితం కానుంది. ఉత్తరం వైపు గా సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగ్ దేవ్ పూర్-చౌటుప్పల్ వరకు... దక్షిణం దిక్కుగా చౌటుప్పల్ నుంచి ఆమన్గల్-షాద్ నగర్ ద్వారా తిరిగి సంగారెడ్డి దాకా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరే ప్రతీ హైవేని రీజినల్ రింగ్ రోడ్డు కలుపుతుంది. అన్ని హైవే ల దగ్గర గ్రేడ్ సపరేటర్స్ కూడా నిర్మించనున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న రాష్ట్ర అవసరాలు - రోడ్ల అభివృద్ధిలో భాగంగా రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. పారిశ్రామిక - ఐటీ హబ్ గా ఎదుగుతున్న హైదరాబాద్ కు ఇదెంతో ఉపయోగపడుతుందని భావించారు. రీజినల్ రింగ్ రోడ్డు సాధించేందుకు ఎంతో కృషి చేశారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు టీఆర్ ఎస్ ఎంపీలు సైతం కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి... రీజినల్ రింగ్ రోడ్డు ఆవశ్యకతను తెలియజేశారు. తాజాగా ఎన్ హెచ్ ఏ ఉన్నతాధికారులతో టీఆర్ ఎస్ ఎంపీలు భేటి అయి డీపీఆర్ ను వివరించారు. చివరకు దాన్ని సాధించడంలో విజయం సాధించారు.