చంద్రబాబును గుర్తు కు తెచ్చుకున్న మరుక్షణం కొన్ని విషయాలు చప్పున గుర్తుకు వస్తాయి. తనకు భద్రత ను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచే ఆందోళనలు.. నిరసనల తో పాటు.. తనకు ఎదురైన కష్టం గురించి అదే పనిగా మీడియాతో గంటల పాటు తన ఆవేదనను వ్యక్తం చేయటం కనిపిస్తుంది.
ఇలాంటివి ఇప్పటి తరానికి ఏ మాత్రం సూట్ కావన్న విషయం తెలిసినప్పటికీ బాబు తన తీరు మార్చుకోరు. అంతేనా.. భద్రత తగ్గిస్తూ తీసుకునే నిర్ణయం మీద కోర్టును ఆశ్రయిస్తామని హడావుడి చేస్తారు. అయితే.. దీనికి మించి.. మౌనం గా ఉండటం ద్వారా వచ్చే అంతో ఇంతో మైలేజీ ని కూడగట్టు కోవచ్చన్న చిన్న విషయాన్ని కూడా బాబు గుర్తించరు.
మరి.. ఇలాంటి పరిస్థితే దేశంలోని అత్యున్నత రాజకీయ కుటుంబానికి ఎదురైతే ఎలా స్పందిస్తారన్నది తాజా గా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కుటుంబాని కి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు బలగాల్ని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న షాకింగ్ నిర్ణయంపై స్పందించారు. అంచనాలకు తగ్గట్లే.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించటమే కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి అ విశ్రాంతంగా తనను.. తన కుటుంబాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పారు.
భద్రతా బలగాల అంకితభావాన్నికొనియాడుతూ ట్వీట్ చేశారు. ఎస్పీజీతో తన ప్రయాణం కొత్త విషయాలు నేర్చుకునేలా చేసిందని పేర్కొన్నారు. ఇలా తమకు భద్రత ఇచ్చిన సిబ్బందికి ప్రేమపూర్వక థ్యాంక్స్ చెప్పటమే తప్పించి.. తమకున్న ప్రివిలేజ్ ను తీసి పారేశారన్న విషయాన్ని మాట వరసకు కూడా ప్రస్తావించని వైనం చూసైన తర్వాత అయినా.. చంద్రబాబుకు విషయం అర్థమవుతుందంటారా?