అచ్చెన్నాయుడిని కలవటానికి చంద్రబాబుకి నో పర్మిషన్ ..కారణం ఇదే !

Update: 2020-06-13 12:10 GMT
ఏపీ జైళ్ల శాఖ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు.ఈఎస్ ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తమ పార్టీ నేత అచ్చెన్నాయుడుని పరామర్శించడానికి అనుమతించాలని కోరిన బాబుకు అనుమతి నిరాకరించారు. ఈఎస్ ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన టిడిపి ఎమ్మెల్యే, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అనారోగ్య కారణంగా గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

అచ్చెన్నను పరామర్శించాలి, ఆయనకు ధైర్యం చెప్పాలి అనుకున్న చంద్రబాబు జైళ్ళశాఖ అధికారులకు అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే వైరస్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పింది. గత రెండు నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదంటూ జైళ్ల శాఖ అధికారులు చంద్రబాబుకు తేల్చిచెప్పారు. మరో మార్గంగా గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రి సూపరిండెంట్ ను టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని కలవటానికి అనుమతించాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇక అక్కడ కూడా మాజీ సీఎం కు చేదు అనుభవం ఎదురైంది.

ఆయన రిమాండ్ లో ఉన్నారని మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని, అలా కాకుంటే కలవడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సైతం ఆయన్ని కలవడానికి అధికారులు అనుమతి నిరాకరించారు. అచ్చెన్నాయుడు ను పరామర్శించటానికి కూడా అవకాశం లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇక ఈఎస్ఐ స్కాం లో వైసీపీ కావాలని అచ్చెన్నాయుడిని ఇరికించింది అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News