ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడులో గతంలో కనిపించని ఓ కొత్త కోణాన్ని బయటకు తీసుకువస్తున్నట్లుగా ఉందనే చెప్పాలి. రాయలసీమలోని ఫ్యాక్షన్ రాజకీయాలను పారదోలుతున్నామంటూ డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు... ఇప్పుడు తనలోని ఫ్యాక్షనిస్ట్ ను బయటపెట్టుకుంటున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇదంతా వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న తన అంతర్గత సర్వేల ద్వారా వచ్చిన మార్పేనన్న వాదన కూడా వినిపిస్తోంది. పట్టపగలు, బహిరంగంగా, జనమంతా చూస్తుండగా... సీఎం హోదాలోని చంద్రబాబు... ఓ మహిళకు చేయి చూపిస్తూ... ఫినిష్ చేస్తారంటూ హెచ్చరించడమంటే మాటు కాదు కదా. అది కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసమంటూ తన ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి- మన ఊరు కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా చంద్రబాబు నోట ఈ మాటలు వచ్చాయంటే నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు. తన పాలనను విమర్శిస్తూ, తన ప్రభుత్వ హయాంలో అవినీతి వరదలై పారుతోందంటూ ఆరోపించిన ప్రజల పై తనదైన శైలిలో విరుచుకుపడిన చంద్రబాబు... ఏకంగా ఓ మహిళకు చేయి చూపిస్తూ ఫినిష్ చేస్తారంటూ వ్యాఖ్యానించడం చూస్తుంటే... బాబులో ఇప్పటిదాకా లోపలి అంతరాల్లో దాగి ఉన్నది ఓ ఫ్యాక్షనిస్టేనన్న వాదన కూడా వినిపిస్తోంది.
అసలు ఈ తరహా కొత్త చంద్రబాబు మనకు పరిచయం కావడానికి దారి తీసిన ఘటనను ఓ సారి పరిశీలిస్తే... ఈ నెల 2 నుంచి ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమం కోసం నేటి ఉదయం చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు బయలేదేరారు. కాకినాడలో అడుగుపెట్టిన చంద్రబాబు.... జన్మభూమి కార్యక్రమ వేదికకు వెళ్లేందుకు బస్సులో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో చంద్రబాబు పాలనను విమర్శిస్తూ కొందరు బీజేపీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారు. చంద్రబాబు బస్సును అడ్డుకునే యత్నం చేశారు. చంద్రబాబు పాలనలో అవినీతి వరదలై పారుతోందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలో అయితే ఈ తరహా ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండానే చంద్రబాబు బయలుదేరి వెళ్లిపోయేవారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ... తన ఓటమిని సర్వేలు తేల్చి పారేసిన వేళ... చంద్రబాబులో దాగున్న అసలు సిసలు రూపం బయటకు వచ్చేసింది. బస్సును నిలిపివేయమన్న చంద్రబాబు బస్సు దిగారు. ఆ వెంటనే తనపైనా, తన ప్రభుత్వ తీరుపైనా విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ కార్యకర్తల పై బాబు వీరంగమాడారు. అయినా ఆందోళన కారులు వెనక్కు తగ్గకపోగా... వారిలోని ఓ మహిళ చంద్రబాబు అవినీతి పాలన పై మరింత బిగ్గరగా... నినాదాలు చేశారు. అంతే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటకు తీశారు. *బయటకొస్తే వదిలిపెట్టరు పబ్లిక్. జాగ్రత్తగా ఉండు. ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని కొడతారు.. జాగ్రత్త. ఇలాగే చేస్తోంటే మీరు ఫినిష్ అయిపోతారు* అంటూ సదరు మహిళకు చేయి చూపిస్తూ చంద్రబాబు తనదైన రీతిలో ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.
ఈ తరహా చంద్రబాబును అప్పటిదాకా చూడని జనం... ఒక్కసారిగా షాక్ తిన్నారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు వచ్చిన సీఎం... తమపైనే రౌడీయిజం చేసేందుకు బరి తెగించారంటే ఇంకెవరికి చెప్పుకోవాలన్న కోణంలో జనం నిజంగానే వణికిపోయారు. ప్రభుత్వంలోని అవినీతిని ప్రశ్నిస్తే... ఏకంగా చంపేస్తారా? అంటూ బీజేపీ కార్యకర్తలు కూడా మరింత ఆగ్రహంతో చంద్రబాబును నిలదీసేందుకు యత్నించారు. అయితే అప్పటికే రంగంలోకి దిగిపోయిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి ఈడ్చి పారేయగా... చంద్రబాబు మాత్రం బస్సెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్షణాల వ్యవధిలోనే జరిగి.ఓయిన ఈ ఘటనను అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే... విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సహకరించని అధికారులను ప్రశ్నిస్తే... ఆయనను ఫ్యాక్షనిస్ట్ గా ముద్ర వేసే చంద్రబాబు... ఇప్పుడు తన పాలనను ప్రశ్నిస్తున్న వారిని ఏకంగా లేపేస్తాం, ఫినిష్ చేసేస్తాం, మా వాళ్లు బయటికొస్తే వదిలిపెట్టరు, జాగ్రత్తగా ఉండు, మా వాళ్లు మిమ్మల్ని కొడతారు. అవసరమైతే ఏకంగా ఫినిష్ చేస్తారంటూ వ్యాఖ్యానించడాన్ని ఏమనాలో కూడా చంద్రబాబే చెప్పాలన్న వాదన కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. మొత్తంగా ఈ ఒక్క ఘటనతో తన లో్పలి మనిషిని చంద్రబాబు బయటకు తీసుకొచ్చారని, తనలో దాగున్న ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటాడో ప్రజలకు చూపించారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాకుండా ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతానోనన్న భయంతోనే చంద్రబాబు తన అసలు రూపాన్ని బయటకు తీసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.
Full View