ఎన్నికల వేళ.. ఇద్దరు అధినేతల ముచ్చట్లు?

Update: 2015-12-27 05:21 GMT
ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది. నిజానికి ఇలాంటి సన్నివేశం దాదాపుగా ఉండదేమో. రాజకీయ పార్టీలకు.. వాటి అధినేతలకు ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి.. కీలకమైనవి. వారి బతుకుల్ని ప్రభావం చేసేవి. ఇలాంటి ప్రజాతీర్పు కోసం ఎన్నికలు నిర్వహించే వేళ.. రాజకీయ పక్షాలు ఎంత ఉద్విగ్నంగా.. ఉద్రేకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజకీయ పార్టీ అధినేతలు చాలా సీరియస్ గా ఉంటూ.. గెలుపు కోసం విపరీతంగా శ్రమిస్తారు. విజయానికి అవసరమైన ఏ చిన్న అవకాశాన్ని వదిలేయరు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ.. తమకు లబ్థి చేకూరే దేన్ని విడిచిపెట్టరు.

అయితే.. తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితి అవిష్కృతం కానుంది. సమీప భవిష్యత్తులో మరే ఎన్నికల పోలింగ్ రోజున ఇలాంటి సన్నివేశాలు కనిపించే అవకాశం ఉండదని చెప్పొచ్చు. ఆదివారం తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ ఈ ఎన్నికల్లో విజయం కోసం అటు అధికారపక్షం.. ఇటు విపక్షం పోటాపోటీగా తలపడుతున్నాయి. ఎవరికి వారు ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పరిస్థితి.

క్లీన్ సీప్ కోసం తెలంగాణ అధికారపక్షం ప్రయత్నిస్తుంటే.. ఉనికి కోసం తెలంగాణ విపక్షాలు విపరీతంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్నేహపూర్వకంగా వ్యవహరించటం సాధ్యం కాని వ్యవహారం. అయితే.. అందుకు భిన్నమైన సీన్ కనిపించనుంది. ఓపక్క ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే.. మరోవైపు తెలంగాణ అధికారపక్ష అధినేత.. ఏపీ అధికారపక్ష అధినేతలు ఇద్దరు కలవటం..కులాశాగా కబుర్లు చెప్పుకోవటం ఖాయమని చెప్పొచ్చు. విడిరోజుల్లో కలవటమే ప్రత్యేకత అయితే.. ఎన్నికల వేళ.. అది కూడా పోలింగ్ జరుగుతున్న సమయంలో రెండు పార్టీలకు చెందిన అధినేతలు కలిసి కొద్ది గంటలు గడపటం మాత్రం కాస్త అరుదైన వ్యవహారంగా చెప్పాలి. ఇలాంటి సన్నివేశు సమీప భవిష్యత్తులో మాత్రం కనిపించటం సాధ్యం కాకపోవచ్చు. ఎన్నికల పోలింగ్ రోజున రెండు అగ్రపార్టీ అధినేతలు కులాసాగా కబుర్లు చెప్పుకోవటం.. కలిసి గంటల కొద్దీ సమయాన్ని గడపటం అన్నది చూడకపోవచ్చు.
Tags:    

Similar News