ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. వైరి వర్గాలను దెబ్బకొట్టడంతో పాటు సొంత పార్టీలోని తమకు అనుకూలమైన వారి కోసం ఆయా పార్టీల నేతలు... సొంత పార్టీకే చెందిన మరొకరికి దెబ్బలేసుకుంటూ ముందుకు సాగుతున్న వైనం ఇప్పుడు నిజంగానే రంజుగా సాగుతోందని చెప్పాలి. మొన్నామధ్య కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో దివంగత భూమా నాగిరెడ్ది సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి విజయం కోసం టీడీపీ శ్రేణులు మొత్తం కట్టకట్టుకుని కదిలాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ - పదుల సంఖ్యలో మంత్రులు - అంతకు రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు నంద్యాలలో మకాం వేసిన చేసిన యాగీ ఇంకా మన మది నుంచి తొలగిపోనే లేదు.
భూమా ఫ్యామిలీ కోసం తామంతా ఉన్నామంటూ నాడు టీడీపీ శ్రేణులు బాగానే కలరింగ్ ఇచ్చాయి. అది ఉప ఎన్నిక. భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నిక. అది జరిగి ఇప్పటికే దాదాపుగా రెండేళ్లవుతోంది. రెండేళ్లలోనే ఎంత మార్పు వచ్చిందంటే.. నాడు భూమా ఫ్యామిలీ కోసం కట్టకట్టుకుని వచ్చిన గ్యాంగంతా... ఇప్పుడు అదే భూమా ఫ్యామిలీకి చుక్కలు చూపించేందుకు రంగంలోకి దిగిపోయాయి. ఇంకేముంది... నాడు వెన్నంటి నడిచిన వారి నుంచే ఇప్పుడు భూమా ఫ్యామిలీకి దెబ్బల మీద దెబ్బలు పడిపోతున్నాయి. ఈ తరహా దెబ్బలను చూస్తుంటే... అసలు వచ్చే ఎన్నికల్లో భూమా జూనియర్ కు కనీసం టికెట్ అయినా దక్కుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అయినా ఇప్పుడేం జరిగిందని ఇంతగా చెప్పాల్సి వస్తోందన్న విషయానికి వస్తే.. నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి... నంద్యాల అసెంబ్లీలోనే కాకుండా నంద్యాల పార్లమెంటు పరిధిలోనూ కీలక పదవి అనే చెప్పాలి. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవి తమదేనని భూమా ఫ్యామిలీతో పాటు అనుచర వర్గం కూడా ధీమాగానే ఉంది. అందులోనూ భూమా మరణం తర్వాత ఆయన స్థానంలో ఆయన అన్న కొడుకే వచ్చారు కదా. అంతేనా... తండ్రి మరణంతో ఏకంగా అతి చిన్న వయసులోనే బంపర్ ఆఫర్ కొట్టేసిన అఖిలప్రియ ఏకంగా మంత్రిగా ఉన్నారాయే. మరి భూమా వర్గాన్ని కాదని ఆ పదవి వేరే వారికి ఎలా వెళుతుంది? కరెక్టే. వాస్తవానికి వారి వర్గాకే ఆ పదవి వెళ్లాలి.
అయితే ఇప్పుడు ఆ పదవి భూమా వర్గానికి కాకుండా నంద్యాల మాజీ ఎమ్మెల్యేగానే కాకుండా టీడీపీలో సీనియర్ గా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా... ఇంకాస్త ప్రస్తుతానికి వస్తే చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేరిపోయిన ఎన్ ఎండీ ఫరూఖ్ వర్గానికి చెందిన చింతల సుబ్బారాయుడికి దక్కేసింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన భూమా వర్గం... ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమైపోయింది. వాస్తవానికి ఈ పదవిపై ఎంతోకాలంగా ఆశలు పెట్టుకున్న భూమా వర్గానికి చెందిన లక్ష్మీకాంతరెడ్డికి టీడీపీ అధిష్ఠానం నుంచి కూడా హామీ లబించిందట. అయితే హామీలను తుంగలో తొక్కడంలో తనకంటూ ప్రత్యేకతను కలిగిన చంద్రబాబు ఇప్పుడు లక్ష్మీకాంతరెడ్డిని కాకుండా... ఫరూఖ్ వర్గానికి చెందిన చింతల సుబ్బారాయుడికి పదవి కట్టబెట్టేశారు. దీంతో భూమా ఫ్యామిలీకి ఇప్పుడు టీడీపీలో బ్యాండు బాజా మొదలైనట్టేనన్న వాదన వినిపిస్తోంది.