అనుకున్నదే నిజమైంది. బాబు సమర్థతకు.. రాజకీయ పరిణితికి పరీక్షగా మారిన కర్నూలు ఎపిసోడ్ లో బాబు విఫలమయ్యారు. చేతికి వచ్చిన అధికారంతో ఒకే ఒరలో రెండు కత్తుల్ని ఉంచే కార్యక్రమాన్ని మొదలెట్టిన బాబుకు షాకిస్తూ.. అధికారపార్టీ నుంచి బయటకు వచ్చేశారు సీనియర్ రాజకీయ నేత శిల్పా మోహన్ రెడ్డి.
ప్రజలిచ్చిన అధికారంతో సంతృప్తి చెందకుండా.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పలువురు నేతల్ని ప్రతిపక్ష పార్టీ నుంచి తీసుకొస్తున్న చంద్రబాబు తీరును అప్పట్లో పలువురు తప్పు పట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఒకే నియోజకవర్గానికి చెందిన వైరి వర్గాల్ని ఒకచోటకు తీసుకొచ్చే ప్రమాదకరమైన ఆట.. బాబుకు ఇబ్బందికరంగా మారుతుందన్న అంచనాలు మొదట్లోనే వ్యక్తమయ్యాయి.
దీనికి తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శిల్పా బ్రదర్స్ తో సంతృప్తి చెందని చంద్రబాబు.. వారి వైరి వర్గమైన భూమాను జగన్ పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు భారీగానే ప్రయత్నించారు. చేతిలో ఉన్న అధికారంతో భూమా బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి అధికార పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.
ఇదిలా ఉంటే.. ఊహించని రీతిలో భూమా నాగిరెడ్డి మరణించటంతో నంద్యాల రాజకీయం మరింత రాజుకుంది. భూమా మరణం నేపథ్యంలో జరిగే ఉప ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాన్ని తనకు అప్పగించాలంటూ శిల్పా బ్రదర్స్ కోరుతున్నారు. అదే సమయంలో తన తండ్రి మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తమ కుటుంబానికే ఇవ్వాలంటూ భూమా కుమార్తె మంత్రి అఖిల ప్రియ కోరారు. చివరకు భూమా ఫ్యామిలీకి సీటు ఇచ్చేందుకు బాబు డిసైడ్ అయిన నేపథ్యంలో.. శిల్పా బ్రదర్స్ పార్టీ నుంచి బయటకు వస్తారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఆ వాదనను నిజం చేస్తూ.. శిల్పా మోహన్ రెడ్డి నోటి నుంచి సంచలన ప్రకటన వచ్చింది. తాను అధికార పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు. త్వరలో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు ప్రకటించారు.
శిల్పా నిర్ణయం నంద్యాలలో అధికార పార్టీకి తీరని నష్టం వాటిల్లేలా చేస్తుందని చెబుతున్నారు. ప్రత్యర్థులే లేకుండా చేసుకోవాలన్న అత్యాశతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసిన చంద్రబాబుకు.. ఇప్పుడు అదే పెద్ద శాపంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో శిల్పాతో మొదలైన గుడ్ బైల పర్వం రానున్న రోజుల్లో మరిన్ని జిల్లాల్లో ఇలాంటివే రిపీట్ అయినా ఆశ్చర్యం లేదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. టీడీపీలో తమను అడుగడుగునా అవమానిస్తున్నారని.. అందుకు తాము పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లుగా శిల్పా మోహన్ రెడ్డి తన అనుచరులకు.. క్యాడర్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామం బాబును ఇరుకున పడేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/