బూతులు, అసభ్యతతో కూడిన సోషల్ మీడియా పోస్టులను పెడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల మీద తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. తమ పార్టీలోని ఒక మహిళా నేతను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి మీద చంద్రబాబు ధ్వజమెత్తారు. అలాంటి అసభ్య రాతలతో కూడిన పోస్టు ఒకదాన్ని చూపిస్తూ, అందులోని బూతులన్నింటినీ చదివి వినిపించారు చంద్రబాబు నాయుడు.
చాలా మంది ఈ తీరు పట్ల ఆశ్చర్యపోయారు. చంద్రబాబుకు ఏమైంది అని అనుకున్నారు. మరీ దారుణంగా వ్యవహరించారు చంద్రబాబు. సోషల్ మీడియా అన్నాకా అక్కడ అన్ని రకాల వాళ్లూ ఉన్నారు. అవి నచ్చకపోతే పోలిసులకు ఫిర్యాదు చేయాలి. అంతే కానీ.. చంద్రబాబు మరీ విడ్డూరంగా వ్యవహరించారు.
అలా అంటే బూతు పోస్టులు పెట్టడంలో, నీఛంగా మాట్లాడటంలో, నీఛమైన పోస్టులు పెట్టడంలో తెలుగుదేశం పార్టీ వారూ ఆరితేరారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వారి వైపు నుంచి కూడా అలాంటి పోస్టులు బోలెడన్ని కనిపిస్తూ ఉంటాయి. అయితే చంద్రబాబు మాత్రం తమ వాళ్లంతా శుద్ధపూసలని, వైసీపీ వాళ్లు దుర్మార్గులు అన్నట్టుగా మాట్లాడారు.
ఈ నేఫథ్యంలో వైసీపీ వాళ్లు కూడా స్పందించారు. మొత్తం అకౌంట్ల లిస్టులను పోలీసులకు అప్పగించారు. దాదాపు రెండు వేల మంది టీడీపీ సైనికులు వల్గర్ పోస్టులు పెడుతూ ఉన్నారని, వారంతా లోకేష్ కనుసన్నల్లో, నందమూరి బాలకృష్ణ సొంత భవనంలోని ఆఫీసులోంచి పని చేస్తూ ఉన్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీడీపీ సోషల్ మీడియా సైన్యం గురించి సోషల్ మీడియాలో ఉన్న వాళ్లందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో.. చంద్రబాబు నాయుడు లేనిపోని బూతులు చదవి, ఇప్పుడు టీడీపీ వాళ్లనే ఇరించినట్టుగా ఉన్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.