జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబునాయుడు విచిత్రమైన సవాలు విసిరారు. చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో పులివెందులలో దమ్ముంటే జగన్ గెలవాలని చాలెంజ్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 140 సీట్లు వస్తాయని కాదు కాదు 175కి 175 సీట్లూ గెలవాలని చెప్పటం కాదని పులివెందులలో గెలిపించి చూపించాలని జగన్ కు చంద్రబాబు చెప్పారు. జగన్ జనాలు తరిమికొట్టే రోజు దగ్గర్లోనే వస్తోందని జోస్యం కూడా చెప్పారు.
ఆరోజు వచ్చినపుడు ధైర్యముంటే జగన్ పులివెందులలో గెలిచి చూపించాలన్నారు. చంద్రబాబు సవాలు విసరగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. పులివెందులలో వైఎస్ కుటుంబానికి సంవత్సరాలుగా తిరుగన్నదే లేదు. 1978 నుండి వైఎస్ కుటుంబమే పులివెందులలో గెలుస్తున్న విషయం అందరికీ తెలుసు.
ఇపుడు ముందు వైఎస్సార్ తర్వాత వివేకానందరెడ్డి, విజయమ్మ ఇపుడు జగన్ ఇదే నియోజకవర్గంలో గెలుస్తున్నారు. నామినేషన్ వేస్తే చాలు గెలుపే అన్నట్లుగా ఉంది పులివెందులలో వైఎస్ కుటుంబం పట్టు.
ఈ విషయం చంద్రబాబుకు తెలీందికాదు. వైఎస్ కుటుంబానికి పులివెందులలో ఉన్న పట్టుగురించి ఎవరు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అన్నీ తెలిసి కూడా జగన్ కు చంద్రబాబు సవాలు విసిరారంటేనే ఆశ్చర్యంగా ఉంది. బహుశా కుప్పంలో తనను ఓడించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలపై చంద్రబాబు మండిపోతున్నట్లున్నారు. రేపు 22వ తేదీన జగన్ మొదటిసారిగా కుప్పంకు వస్తున్నారు.
జగన్ వచ్చి వెళ్లిన తర్వాత పరిస్ధితులు ఎలాగుంటాయో అనే టెన్షన్ మొదలైనట్లుంది. అందుకనే చంద్రబాబు పులివెందుల గురించి మాట్లాడారు. సరే ప్రత్యర్ధులన్నాక ఒకరిపై మరొకరు చాలెంజులు విసురుకోవటం సహజమే కదా.కుప్పంలో చంద్రబాబును ఓడించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.
అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని చూస్తున్నారు. ఇదే సమయంలో పులివెందులలో జగన్ను ఓడించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లున్నారు. ఇప్పటికే బీటెక్ రవిని ఇక్కడ అభ్యర్ధిగా ప్రకటించారు కూడా. మరి బీటెక్ రవి సీఎంను ఓడించగలరా ?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.