తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలో కేంద్రం సర్కారుతో ఉన్న మితృత్వం రీత్యా ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన వాటి గురించి ఇంతకాలంగా ఒకింత సంయమనం పాటించిన చంద్రబాబు తాజాగా అసహనం వ్యక్తం చేశారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం చురుకైన బాధ్యత తీసుకోని నేపథ్యాన్ని మనసులో ఉంచుకున్న చంద్రబాబు తన మనోభావాలను కుండబద్దలు కొట్టినట్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధితో చెప్పేశారు.
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొఠారి వివిధ అంశాలపై చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విభజన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతీది అడిగితేనే చేద్దాం అనుకునే వైఖరి మంచిది కాదని ఏపీ చంద్రబాబు అన్నారు. సమన్యాయం లేని విభజనతో ప్రజల్లో కసి - ఆగ్రహం పెల్లుబికాయని అందుకు అప్పటి అధికార కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుందని పరోక్ష హెచ్చరికను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. విభజన నష్టాలు - కష్టాల విషయంలో ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొఠారిని బాబు కోరారు.
దక్షిణాదిలో ఆదాయం సమకూర్చుకోవటంలో పొరుగురాష్ట్రాల స్థాయికి చేరేదాకా ఏపీకి కేంద్రం సాయపడాలని కొఠారికి ఈ సందర్భంగా చంద్రబాబు విన్నవించారు. విభజన చట్టంలో చెప్పిన ప్రత్యేక హోదా ఇంకా రాలేదని, రాజధానికి పూర్తిస్థాయి సహకారం అందడం లేదని తెలిపారు. పరిశ్రమలు లేవు...మౌలిక సదుపాయాలు లేవు, విద్యా వైజ్ఞానిక పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని అన్నారు. ఆ స్థాయికి ఏపీ చేరాలంటే కేంద్రం సహకరించాలని తమ ప్రజల మనోగతాన్ని కేంద్రానికి తెలియజేయండని కోఠారికి తెలియజేశారు. బాబు స్పందనలు చూస్తుంటే ఇటు ఆకాంక్షల చిట్టా వినిపిస్తూనే అటు అసంతృప్తిని కూడా స్పష్టం చేసినట్లుందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.