లోకేశ్‌ కు చంద్రబాబు క్లాస్.. టీడీపీలో లేటెస్ట్ టాక్ ఇదే..

Update: 2019-12-07 07:15 GMT
నారా లోకేశ్.. తండ్రి మంత్రి పదవిని, పార్టీలో చేతిలో పెడితే కింగ్‌లా బతికారే కానీ పార్టీని మాత్రం తుంగలోకి తొక్కేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో తాను స్వయంగా ఓటమి పాలవడంతో పాటు పార్టీ కూడా ఎన్నడూ లేని స్థాయిలో దెబ్బతినడంతో అందరి వేళ్లూ లోకేశ్ బాబువైపే చూపించాయి. పార్టీ కష్టాల్లో ఉన్న వేళ సొంత రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ గోడలు దూకినవారు కూడా లోకేశ్‌పైనే విమర్శలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. ఇంత జరిగినా తండ్రి చంద్రబాబు మాత్రం లోకేశ్‌ను ఏమీ అనలేదనే చెబుతారు టీడీపీలో ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న నేతలు. అయితే.. రెండు రోజుల కిందట మాత్రం చంద్రబాబులోని అగ్నిపర్వతం బద్దలైందట.. ఆ లావా లోకేశ్‌బాబుపై చిమ్మి ఆయన్ను ఆగ్రహ జ్వాలకు గురిచేసిందని టీడీపీ నాయకుల నుంచే వినిపిస్తోంది. ఇంక ముసుగులెందుకు.. సింపుల్‌గా చెప్పాలంటే చంద్రబాబు తన కొడుకు లోకేశ్‌‌పై కోపం తిట్టిన తిట్టకుండా తిట్టారన్నది అసలు విషయం.

ఆ కోపంలో చంద్రబాబు గత అయిదేళ్లలో జరిగిన ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ నిన్ను జాకీలు పెట్టి పైకి లేపుతున్నా లేవకపోగా పార్టీని నాశనం చేశావని, ఎప్పుడేం మాట్టాడాలో తెలీకుండా పరువు తీస్తున్నావన్నట్లుగా తీవ్రస్థాయిలో ఆగ్రహించారని చెబుతున్నారు.

లోకేశ్‌కు రాజకీయంగా ఎంతగా పుష్ చేస్తున్నా ఆయన నిలదొక్కుకోలేకపోవడంతో పాటు పదేపదే సోషల్ మీడియాలో నెటిజన్లకు దొరికిపోతుండడంపైనా చంద్రబాబు ఆగ్రహించారని టాక్. ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్‌ పూర్తిస్థాయిలో రాజకీయాలను ఒంటపట్టించుకోకపోవడం.. అందులోను ట్విట్టర్ల రూపంలో ట్వీట్లు చేస్తూ ప్రభుత్వంపైనా, జగన్మోహన్ రెడ్డిపైనా విమర్సలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమధ్య అమరావతిలో టిడిపి బృందం పర్యటించే సమయంలో నారా లోకేష్, చంద్రబాబుతో పాటు ఆ బస్సులోనే ఉన్నారు. అయితే రైతులు చెప్పులు విసిరేసే సమయంలో మాత్రం లోకేష్‌ ఒక నేతను మీ హెయిర్ స్టైల్ బాగుంది. మీరు హ్యాండ్‌సమ్‌గా ఉన్నారంటూ మాట్లాడారు. ఇది కాస్త ఆ బస్సులో ప్రయాణించే నేతలే వీడియోలు తీశారు. అందులో లోకేష్ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. రైతులు ఆందోళన చేస్తూ చెప్పులు విసురుతుంటే లోకేష్ మాత్రం అదేదీ పట్టించుకోవడం మాట్లాడిన తీరు చంద్రబాబుకు బాగా కోపం తెప్పించిందట. దీంతో చంద్రబాబు, లోకేష్‌ను పిలిచి క్లాస్ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేస్తూ జగన్‌ను విమర్సిస్తున్న తీరు బాగానే ఉంది. అయితే బయటకు వచ్చినప్పుడు తప్పులు లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మాట్లాడడం నేర్చుకో. ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు సీరియస్‌నెస్ కూడా నేర్చుకోవాలి అంటూ లోకేశ్ మొదటి నుంచి చేస్తున్న తప్పులను కొన్నిటిని ప్రస్తావించి గట్టిగానే క్లాస్ పీకారట.
Tags:    

Similar News